Boyapati Srinu: ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం బోయపాటి శ్రీనుకు సాధ్యమేనా?

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు తెరకెక్కాయి. సింహా సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో దమ్ము సినిమా తెరకెక్కగా లెజెండ్ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సరైనోడు సినిమా తెరకెక్కి విడుదలైంది. సరైనోడు సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన లెజెండ్ సినిమా స్థాయిలో యునానిమస్ పాజిటివ్ టాక్ ను అయితే సొంతం చేసుకోలేదు. మరోవైపు జయ జానకి నాయక, వినయ విధేయ రామ సినిమాలు సైతం బోయపాటికి భారీ షాకిచ్చాయి.

బాలయ్య బోయపాటి (Boyapati Srinu) సినిమాలకు వచ్చిన స్థాయిలో బోయపాటి శ్రీను తర్వాత సినిమాలకు ప్రశంసలు రావడం లేదు. బోయపాటి శ్రీను ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. బోయపాటి శ్రీను స్కంద సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. స్కంద సినిమా థియేట్రికల్ హక్కులు 50 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఈ టార్గెట్ ను ఈ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

రామ్ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ గత సినిమాలైన రెడ్, ది వారియర్ డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయనే సంగతి తెలిసిందే. స్కంద సినిమా కోసం రామ్ ఎంతగానో కష్టపడ్డారని తెలుస్తోంది. రామ్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా శ్రీలీల సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు కలిసొస్తోంది.

స్కంద మూవీ బుకింగ్స్ యావరేజ్ గా ఉండగా సినిమా విడుదలైతే బుకింగ్స్ పుంజుకుంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాకు బుకింగ్స్ మెరుగ్గా ఉన్నాయి. రామ్ తర్వాత సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus