మెగాస్టార్ చిరంజీవి వెండితెరకు రీఎంట్రీ ఇస్తున్న మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతోంది. వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఖైదీ నంబర్ 150 థియేటర్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయి. ట్రైలర్ కూడా విడుదలకాకముందే చిత్రం శాటిలైట్ హక్కులను ఓ ఛానల్ వాళ్ళు 13 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఈ రేట్లు చూస్తుంటే చిరు చిత్రంపై ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతోంది. తాజాగా ఓ విదేశీ సినీ పంపిణీ సంస్థ మెగాస్టార్ 150 వ చిత్రం ఓవర్సీస్ హక్కులను 1.8 మిలియన్ డాలర్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు చిరు సినిమాలు ఓవర్సీస్ ఖాతానే తెరవలేదు. ఎందుకంటే తొమ్మిదేళ్లక్రితం అక్కడ మన సినిమాలకి అంత గిరాకీ ఉండేది కాదు.
గత ఐదేళ్లుగా ఆదరణ పెరిగింది. కలెక్షన్లు కూడా పెరిగాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవర్సీస్ స్టార్ గా ఉన్నారు. ప్రిన్స్ చిత్రాలు అక్కడ మంచి వసూళ్లను రాబట్టాయి. ఎన్టీఆర్, చెర్రీ సినిమాలు కూడా ఈ మధ్యనే వన్ మిలియన్ డాలర్ల కలక్షన్ల మార్క్ ని క్రాస్ చేశాయి. అటువంటిది తొలి సారి అక్కడ ల్యాండ్ కానున్న ఖైదీ ఎన్ని మిలియన్ డాలర్లు వసూలు చేస్తాడోనని ఇప్పటి నుంచే ఆసక్తికర చర్చ మొదలయింది. అమెరికాలోను బాస్ బాక్స్ ఆసీస్ బాక్స్ లు బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.