టాలీవుడ్ కు దాదాపుగా 9ఏళ్ల ముందు గుడ్ బై చెప్పి..మళ్ళీ తన ప్రతిష్టాత్మక 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి…అయితే ప్ర్యాక్టికల్ గా మాట్లాడుకుంటే ఇది చిరు సెకెండ్ ఇన్నింగ్స్ అనే చెప్పాలి…ఇదిలా ఉంటే సొంత బ్యానర్ లో, తన వర్గానికి బాగా సన్నిహితుడైన దర్శకుడితో తానే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తేజ…ఇదిలా ఉంటే చిరు రీ ఎంట్రీ పుణ్యమా అని ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి…అంతేకాదు ఈ సినిమాను ఎలా అయినా హిట్ చెయ్యాలనే కసితొ ఉన్నారు మన మెగా అభిమానులు..ఇదిలా ఉంటే చిరు రీ ఎంట్రీను భారీగా ప్లాన్ చేశాడు మెగా పవర్ స్టార్…ఈ సినిమాని ప్రతీ ఏరియా లో భారీగా అమ్మెలా పక్క వ్యూహంతో ముందుకు సాగడంలో సక్సెస్ అయ్యాడు చెర్రీ…
అయితే ఇదే క్రమంలో ఈ సినిమా నైజామ్ రైట్స్ విషయంలో ఏదో తెలియని బజ్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది…ఇంతకీ ఏంటి ఆ బజ్ అంటే…ఈ మ్యాటర్ చదవండి….నైజాం ఏరియాలో ఖైదీ నంబర్ 150ని రూ.16 కోట్లకు ఏషియన్ ఫిలిమ్స్ కొనుగోలు చేసిందని అఫీషియల్ గా ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. అయితే అసలు కధ వేరే ఉంది అని తెలుస్తుంది….ఇంతకీ ఏమా కధ అంటే….మెగాస్టార్ ల్యాండ్ మార్క్ మూవీ కొనేందుకు బడా డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చినా.. నిర్మాత చరణ్ చెప్పిన రేట్ విని వెనక్కి తగ్గారట. అయితే.. మూవీ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న రామ్ చరణ్.. ఈ సినిమాను తనే రిలీజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడట. ఇప్పుడు నైజాంలో ఖైదీని చెర్రీనే రిలీజ్ చేస్తున్నాడని.. కానీ ఏషియన్ ఫిలిమ్స్ ద్వారా ఈ రిలీజ్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఇదంతా బాగానే ఉంది కానీ….అన్ని ఏరియాల్లోనూ భారీ రేట్లకే అమ్ముడు పోయిన ఈ సినిమా రికవర్ కావాలంటే.. ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీ టాప్ 2 హిట్స్ లో ఒకటిగా నిలవాల్సిందే. మరి ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందికర పరిణామాలే ఎదురవుతాయి…చూడాలి మరి ఏం జరగబోతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.