అల వైకుంఠపురంలో చిత్రంతో త్రివిక్రమ్ దశ తిరిగింది. ఆయనకు బడా బడా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ కాగా, మరో క్రేజీ ఆఫర్ తన ఖాతాలో చేరిందట. మెగాస్టార్ చిరంజీవి తో త్రివిక్రమ్ మూవీ కూడా ఓ ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. గతంలో చిరంజీవికి త్రివిక్రమ్ ఓ స్టోరీ లైన్ వినిపించారట. ఐతే అప్పుడు ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టిన చిరు దానిపై ఆసక్తి చూపిస్తున్నారట. కథ సంగతి ఎలా ఉన్న త్రివిక్రమ్ టేకింగ్ పై మెగాస్టార్ కి చాలా నమ్మకం పెరిగిందట. కాబట్టి ఎప్పటికి నుండో త్రివిక్రమ్ డైరెక్షన్ లో చిరు మూవీ చేయాలనీ ఎదురు చూస్తున్న మెగాస్టార్ ఫ్యాన్స్ ఆశ తీరే సూచనలు కనిపిస్తున్నాయి.
గతంలో చిరంజీవి నటించిన జై చిరంజీవ చిత్రానికి త్రివిక్రమ్ స్టోరీ మరియు డైలాగ్స్ ఇచ్చారు. ఆ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయినా, ఆ చిత్రంలోని చిరు కామెడీ జనాలకు బాగా నచ్చింది. ఒక వేళ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఓ రేంజ్ లో ఉంటుందని అనిపిస్తుంది. అందుకే ఈ కాంబినేషన్ లో మూవీ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇక బన్నీ తోనే ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిన త్రివిక్రమ్ చిరు తో మరిన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!