వివాదం నేపథ్యంలో బాలయ్య బర్త్ డే కు చిరు రియాక్షన్ ?

నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది 60వ ఏట అడిగిడనున్నాడు. జూన్ 10 1960లో పుట్టిన బాలకృష్ణ షష్ఠి పూర్తి కూడా జరుపుకోనున్నారట. బాలయ్య పుట్టిన రోజు పురస్కరించుకొని భారీగా వేడుకలు నిర్వహించాలని ఫ్యాన్స్ ప్రణాళికలో ఉన్నారు. మరో ప్రక్క చిత్ర ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పనున్నారు. ఐతే బాలయ్యకు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెవుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇటీవలే సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ప్రారంభించిన ఆయన అన్ని ముఖ్య సందర్భాలకు స్పందిస్తున్నారు. ప్రముఖులకు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలియజేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ఇలా పలువురు ప్రముఖులకు ఆయన బర్త్ డే విషెష్ చెప్పడం జరిగింది. బాలయ్య విషయంలో సందేహం రావడానికి కారణం. ఈ మధ్య వారిలో రగిలిన వివాదమే. సినిమా పరిశ్రమ కార్యాచరణకు సంబంధించిన కొన్ని ముఖ్య సమావేశాలకు బాలయ్యను ఆహ్వానించని కారణంగా ఆయన చిరు మరియు కొందరిపై కొన్ని ఆరోపణలు చేశారు.

Clash Between Chiranjeevi and Balakrishna1

ఈ విషయంలో పరిశ్రమలో వివాదం ఏర్పడగా బాలయ్య అనుకూలురు, చిరు అనుకూలురు అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. వివాదం ఐతే ఇంకా సమసి పోలేదు. ఈ నేపథ్యంలో బాలయ్యకు చిరు బర్త్ డే విషెస్ చెవుతాడా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus