Adipurush: అలా జరిగితే ఆదిపురుష్ బ్లాక్ బస్టర్ అవుతుందా?

ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా త్రీడీలో మాత్రం ఆదిపురుష్ టీజర్ అదిరిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు ఎదురుకాని స్థాయిలో ఆదిపురుష్ మూవీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరుసగా వివాదాలు ఈ సినిమాను చుట్టుముడుతూ ఉండటం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

కొంతమంది ఈ సినిమాను బ్యాన్ చేస్తామని చెబుతుండగా మరి కొందరు ఈ సినిమా టీజర్ లో కొన్ని పాత్రలను తప్పుగా చూపించారని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అయితే కొంతమంది మాత్రం వివాదాలు ఆదిపురుష్ మూవీకి ప్లస్ కావచ్చని కామెంట్లు చేస్తున్నారు. వివాదాల ద్వారా ఆదిపురుష్ మూవీకి కోట్ల రూపాయల పబ్లిసిటీ వస్తోందని కొంతమంది చెబుతున్నారు. ఆదిపురుష్ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని వివాదాలు కలిసొస్తే మాత్రం

ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారు. 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.

సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ప్రభాస్ తర్వాత సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు . వివాదాలకు ఆదిపురుష్ మేకర్స్ ఏ విధంగా చెక్ పెడతారో చూడాల్సి ఉంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus