Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శ్రీ నందు (Hero)
  • యామిని భాస్కర్ (Heroine)
  • ప్రద్యుమ్న బిల్లూరి, ప్రియాంక శ్రీనివాస్, నర్సింగ్ వాడేకర్, సుఖేష్ రెడ్డి, సింహా ఎన్ తదితరులు (Cast)
  • వరుణ్ రెడ్డి (Director)
  • శ్రీ నందు - శ్యామ్ సుందర్ రెడ్డి (Producer)
  • స్మరణ సాయి (Music)
  • కె.ప్రకాష్ రెడ్డి (Cinematography)
  • ప్రతీక్ నూతి (Editor)
  • Release Date : జనవరి 01, 2026
  • నందూనెస్ - స్పిరిట్ మీడియా - కీప్ డూయింగ్ పిక్చర్స్ (Banner)

నటుడిగా ఇండస్ట్రీలో 19 ఏళ్లు పూర్తి చేసుకున్న నందు ఇప్పటివరకు సరైన ప్రాజెక్ట్ పడక, హీరోగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. అందుకే తనను తాను అప్డేట్ చేసుకుని, హీరోగా నటిస్తూనే స్వీయ నిర్మాణంలో “సైక్ సిద్ధార్థ” అనే సినిమా నిర్మించాడు. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అయితే జనాల దృష్టిని ఆకర్షించింది. మరి సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం..!!

Psych Siddhartha Movie Review

కథ: ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి త్రిష (ప్రియాంక శ్రీనివాస్), నమ్మిన బిజినెస్ పార్ట్నర్ (సుఖేష్ రెడ్డి) కలిసి మోసం చేయడంతో.. ఆఖరికి రెంట్ కట్టడానికి కూడా డబ్బు లేకపోవడంతో చాలా ఛిద్రమైన జీవితం గడుపుతూ ఉంటాడు సిద్ధార్థ రెడ్డి (శ్రీ నందు).

ఇక అతడి జీవితం ఎటు పోతుందో తెలియని స్థితిలో.. ఎంట్రీ ఇస్తుంది శ్రవ్య (యామిని భాస్కర్).

ఆ తర్వాత సిద్ధార్థ లైఫ్ ఎలా మారింది? ఏ దిశగా వెళ్లింది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: యామిని భాస్కర్ ఈ సినిమాకి, కథకి హీరో అని చెప్పాలి. ఆమె పాత్రను దర్శకుడు వరుణ్ డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం బాగున్నాయి. ముఖ్యంగా తనకి ఇంటిమసీ అంటే ఎంతో తెలియదు అని బాధపడే సన్నివేశంలో.. చాలా మెచ్యూర్డ్ గా నటించింది.

ఒక జెన్ జీ లైఫ్ స్టైల్ & థాట్ ప్రాసెస్ ను నందు బాగా రీప్రెజెంట్ చేశాడు. అతని బాడీ లాంగ్వేజ్ కానీ, ఫిజికల్ అపీరియన్స్ కోసం కానీ చాలా కష్టపడినట్లుగా తెలుస్తుంది.

త్రిషగా కనిపించిన ప్రియాంక కూడా బాగా నటించింది. ఫ్రెండ్ గా నటించిన నర్సింగ్ స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నా.. ఇంకాస్త మంచి నటుడ్ని పెట్టి ఉంటే ఆ క్యారెక్టర్ కి వెల్యు యాడ్ అయ్యేది. ప్రద్యుమ్న అనే కుర్రాడు కూడా బాగా నటించాడు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రతీక్ ఎడిట్ ఫార్మాట్ కొత్తగా ఉంది. కొన్నిచోట్ల మరీ ఇంత కొత్తదనం అవసరమా అనిపిస్తుంది కానీ.. ఓవరాల్ గా డిఫరెంట్ ఫీల్ కలిగిస్తుంది.

సినిమాటోగ్రఫీ వర్క్ ఇండీ మేకింగ్ ను తలపిస్తుంది. చాలా సీన్స్ గెరిల్లా ఫార్మాట్ లో షూట్ చేశారు.

దర్శకుడు వరుణ్ రెడ్డి.. ఇప్పటివరకు ఎవరూ తీయని ఫార్మాట్ లో సినిమా తీయాలనుకున్నాడు, సక్సెస్ అయ్యాడు. అయితే.. అది ఎంతవరకు ఆకట్టుకునేలా ఉంది అనే విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కాకపోతే.. చైల్డ్ ఎబ్యూజ్ ను డీల్ చేసిన విధానంలో అతడి సెన్సిబిలిటీని మాత్రం కచ్చితంగా మెచ్చుకోవాలి. ఈ సినిమాతో ఒక సరికొత్త గ్రామర్ ను ఇంట్రడ్యూస్ చేశాడు వరుణ్. ఆ గ్రామర్ ఎంతమంది, ఎంతమేరకు ఎంజాయ్ చేస్తారు అనేది మాత్రం ప్రశ్నార్థకం. ఇలాంటి ఇండీ & ఫ్రీస్టైల్ ఫిలిం మేకింగ్ ను థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ పూర్తిస్థాయిలో సిద్ధంగా లేరు. థియేటర్లకి వస్తున్నారంటే.. కనీస స్థాయి కమర్షియల్ & పాలిష్ ఫిలిం మేకింగ్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు ఆడియన్స్. సో, ఒక ప్రయత్నంగా చూసుకుంటే “సైక్ సిద్ధార్థ”తో డైరెక్టర్ వరుణ్ రెడ్డి కొంతమేరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మరీ ముఖ్యంగా 4th వాల్ ను బ్రేక్ చేస్తూ రాసుకున్న సీన్స్ బాగా పండాయి.

విశ్లేషణ: ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు. అందులోనే నందు & టీమ్ సగం సక్సెస్ అయ్యారు. అయితే.. ఫస్టాఫ్ మరీ కొత్తగా ఉండడంతో, అన్నీ వర్గాల ప్రేక్షకుల దాన్ని ఆస్వాదించలేరు. అయితే.. సెకండాఫ్ కి వచ్చేసరికి ఎమోషన్ & సెన్సిబిలిటీస్ ను బ్యాలెన్స్ చేసిన విధానం కొంచం కవర్ చేసింది. ఓవరాల్ గా.. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని సరికొత్తగా ఎంగేజ్ చేసిన సినిమా ఇది. రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం ఫస్టాఫ్ కాస్త ఓపిక పట్టగలిగితే.. సెకండాఫ్ ఒక సంతృప్తితో బయటికి వెళ్తారు.

ఫోకస్ పాయింట్: ఫస్టాఫ్ సిక్.. సెకండాఫ్ సెన్సిబుల్!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus