Devara: తారక్ చుట్టమల్లే సాంగ్ ఖాతాలో సంచలన రికార్డులు.. ఏమైందంటే?

దేవర (Devara) , పుష్ప2 (Pushpa 2: The Rule) సినిమాలు రెండు నెలల గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాలు సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ డైరెక్టర్ కాగా దేవర సినిమాకు అనిరుధ్ (Anirudh Ravichander)   మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పుష్ప2 టైటిల్ సాంగ్ తెలుగు వెర్షన్ కు యూట్యూబ్ లో 60 మిలియన్ల వ్యూస్ రాగా సూసేకి సాంగ్ తెలుగు వెర్షన్ కు 118 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Devara

అయితే దేవర సినిమా నుంచి విడుదలైన ఫియర్ సాంగ్ తెలుగు వెర్షన్ కు 48 మిలియన్ల వ్యూస్ రాగా చుట్టమల్లే సాంగ్ తెలుగు వెర్షన్ కు మాత్రం ఏకంగా 61 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో చుట్టమల్లే సాంగ్ సూసేకి సాంగ్ వ్యూస్ ను క్రాస్ చేస్తుందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. చుట్టమల్లే సాంగ్ సంచలనాలు మరికొన్ని రోజులు కొనసాగే ఛాన్స్ అయితే ఉంది.

చుట్టమల్లే సాంగ్ లో విజువల్స్ మాత్రం కలర్ ఫుల్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ (Jr NTR)  ఫ్యాన్స్ అంచనాలను మించి దేవర ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. దేవర సినిమా నిడివి ఒకింత ఎక్కువగానే ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది.

దేవర సినిమా బిజినెస్ విషయంలో నిర్మాతలు ఊహించని స్థాయిలో సంతృప్తిగా ఉన్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమాకు ఇతర భాషల్లో సైతం భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉంది. దేవర సినిమాలో ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

‘తంగలాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus