Thangalaan: ‘తంగలాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

చియాన్ విక్రమ్ (Vikram) తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణ చిత్రాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. కొన్నాళ్లుగా విక్రమ్ కి సరైన సక్సెస్ పడట్లేదు. కానీ తన వరకు మాత్రం ప్రతి సినిమాకి బెస్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా ‘తంగలాన్’  (Thangalaan)  అనే భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja)  ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Thangalaan

పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu) , మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఇందులో హీరోయిన్లు. టీజర్, ట్రైలర్స్ వంటివి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. అందులోని విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఆగస్టు 15న అంటే మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు.. తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. “అసలు…సిసలు.. అత్యంత సహఙమైన మట్టి వాసన అందించే సినిమా…” అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఫస్ట్ హాఫ్ చాలా బాగా వచ్చిందట. విజువల్స్, బీజీయం టాప్ నాచ్ లో ఉన్నాయట. విక్రమ్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. మల్టిప్లెక్స్ ఆడియన్స్, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే ఎమోషన్స్ కూడా ‘తంగలాన్’ లో ఉన్నాయని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

బన్నీ వల్లే ఈ స్థాయిలో ఉన్నానన్న బన్నీవాస్.. ముందుండి నడిపిస్తారంటూ?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus