Naga Chaitanyaఅక్కినేని హీరోలు, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) … ల కాంబో అనగానే అందరిలో ఓ ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే అక్కినేని హీరోలకి దేవి అందించిన మ్యూజిక్ అలాంటిది. నాగార్జునతో (Nagarjuna) ‘మన్మథుడు’ ‘మాస్’ (Mass) ‘కింగ్’ (King) ‘ఢమరుఖం’ (Damarukam) ‘బాయ్‘ (Bhai) వంటి సినిమాలకు పనిచేశాడు దేవి శ్రీ ప్రసాద్. వీటిలో ‘మన్మథుడు’ ‘మాస్’ మంచి హిట్ అయ్యాయి. మిగిలినవి కూడా మ్యూజికల్ హిట్సే..! నాగ చైతన్యతో (Naga Chaitanya) ‘దడ’ (Dhada) చేశాడు దేవి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడలేదు.
అయినా పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అలా అక్కినేని ఫ్యామిలీకి మంచి మ్యూజికల్ హిట్స్ అందించిన సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ పేరు కూడా చేరింది. కానీ దేవి ఇప్పుడు ఫామ్లో లేడు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవీని పక్కన పెట్టి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకోవడం, ‘కంగువా’ (Kanguva) సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అనుకున్నట్టు లేకపోవడంతో..
‘దేవి పని అయిపోయింది’ అనే కామెంట్స్ ఎదుర్కొంటున్నాడు. ఆ కామెంట్స్ ను ఓవర్ రైడ్ చేయాలంటే.. దేవికి అక్కినేని హీరోలే ఆప్షన్ గా మారింది ఇప్పుడు. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్.. ‘కుబేర’ (Kubera) సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ధనుష్ తో పాటు నాగార్జున కూడా ఇందులో ఓ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఆ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యిందనే కామెంట్స్ వచ్చాయి.
శేఖర్ కమ్ముల సినిమాల్లోని పాటలు చాలా బాగుంటాయి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా మంచి ట్యూన్స్ రప్పించుకోగల సమర్ధుడు శేఖర్ కమ్ముల. అలాంటిది దేవి నుండి మంచి ఔట్పుట్ తీసుకుంటాడు అనడంలో సందేహం లేదు. అలాగే నాగ చైతన్య ‘తండేల్’ (Thandel) సినిమాకి కూడా దేవి సంగీతం అందిస్తున్నాడు. నిన్న విడుదలైన ‘బుజ్జి తల్లి’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. సో ఈ సినిమాలు హిట్ అయ్యి.. పాటలకి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి రెస్పాన్స్ వస్తే.. దేవి ఫామ్లోకి వచ్చినట్టే అని చెప్పాలి.