‘జై భీమ్’ సినిమా విడుదలైనప్పటి నుండి ఒకటే చర్చ, వార్నింగ్‌లు, పంచాయితీలు. ఈ సమయంలో ఈ విషయం మాట్లాడితే అప్పుడే ఎందుకు అంటారేమో కానీ… ఈ టాపిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. అదే ఆస్కార్. ప్రపంచవ్యాప్తంగా సినిమా జనాలు అతిపెద్ద పురస్కారం భావించే అవార్డు ఇది. ఇందులో మన దేశంలో ఇప్పటివరకు మూడు సార్లు ప్రాతినిథ్యం వహించింది. అయితే పురస్కారం మాత్రం దక్కలేదు. కానీ ఇప్పుడు ‘జై భీమ్’కి ఆ అవకాశం ఉంది అంటున్నారు.
తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే సినిమాలో చర్చించిన, చూపించిన అంశాలు కొన్ని చర్చలకు, వివాదాలకు దారి తీశాయి. అయితే తమిళనాట ఓ వర్గం తప్పిస్తే అందరూ సినిమా అద్భుతంగా ఉంది అంటున్నారు. కొందరైతే సినిమాకు ఆస్కార్ పురస్కారం రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇంకొందరైతే అవార్డు పక్కా అనేస్తున్నారు. ఇప్పటివరకు మన దేశంలో ఆస్కార్‌లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మూడు సినిమాలు వెళ్లాయి.
అవి ‘మదర్ ఇండియా’ (1957), ‘సలామ్ బాంబే’ (1988), ‘లగాన్’ (2001). ఆ తర్వాత మన కథకులు, దర్శకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా జ్యూరీని మెప్పించలేకపోయారు. అయితే ఈ ఏడాదికిగాను మన దేశం నుండి వచ్చే సంవత్సరం సినిమాలు పంపిస్తారు. అందులో ‘జై భీమ్’ ఉంటే కచ్చితంగా అవార్డు దక్కుతుందని పరిశీలకులు కూడా అంటున్నారు. ఏమవుతుందో చూడాలి.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!