Jr NTR: రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. కానీ?

  • September 5, 2022 / 05:35 PM IST

2022 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ కోరుకున్న సక్సెస్ దక్కిందనే సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్లు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ తర్వాత సినిమాలు ఫిక్స్ అయ్యాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ రెండు సినిమాలలో నిర్మాణ సంస్థగా ఉంది. మరోవైపు తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి గత కొన్నిరోజులుగా ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తారక్ ను కలవడం,

పలువురు బీజేపీ నేతలు తారక్ తమ పార్టీకి ప్రచారం చేస్తారని చెప్పడంతో తారక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సమయం ఆసన్నమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తారక్ కు సొంతంగా టీడీపీ ఉంది. గతంలో పలు సందర్భాల్లో తారక్ తాను టీడీపీకే పరిమితమవుతానని మీడియా ముఖంగా స్పష్టత ఇచ్చారు. తారక్ నోరు విప్పితే మాత్రమే రాజకీయాల విషయంలో తారక్ నిర్ణయం ఏంటో తెలిసే అవకాశం ఉంది. మరోవైపు సినిమాల పరంగా తారక్ కెరీర్ అద్భుతంగా ఉన్న తరుణంలో రాజకీయాలపై తారక్ దృష్టి పెట్టే ఛాన్స్ అయితే లేదని మరి కొందరు చెబుతున్నారు.

సినిమాలకు గుడ్ బై చెప్పి తారక్ రాజకీయాల్లోకి రావడం జరిగే పని అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే ఆలస్యంగానైనా తారక్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసేసుకున్నారని కన్ఫామ్ అయింది. సరైన సమయం చూసి తారక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఏపీ రాజకీయాలలో తారక్ చక్రం తిప్పుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ పొలిటికల్ ప్లాన్స్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. ఈ ఏడాది తారక్ కొరటాల శివ కాంబో మూవీ షూట్ మొదలుకానుండగా కేవలం ఆరు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేశారని బోగట్టా.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus