కబాలి ఫలితం రోబో-2 పై పడుతుందా???

ఫర్స్ట్ లుక్ విడుదల చేసిన సమయం నుంచి, తొలి టీజర్ విడుదల అయిన సమయం నుంచి భారీ అంచనాలు పెట్టుకుని మొన్న శుక్రవారం విడుదలయిన కబాలి సినిమా రజని కరియర్ లోనే థ మోస్ట్ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆ సినిమా పరాజయం అయినప్పటికీ ఈ వీకెండ్ ఆ సినిమాకు దాదాపుగా 300కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్షాత్తూ ఆ సినిమా నిర్మాత ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తుంది.

అదే క్రమంలో ఈ సినిమా అటు మాస్ కి, ఇటు క్లాస్ కి ఇద్దరికీ నచ్చేలా లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అయితే ఇక్కడ పాసిటివ్ విషయం ఏమిటంటే… దగ్గర్లో బడా హీరోల సినిమా ఏమీ లేకపోవడంతో బయ్యర్లకు కాస్తలో కాస్త కలసి వచ్చినట్లే. అదే క్రమంలో భారీ నష్టాలు అయితే తప్పవు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా దాదాపుగా రెండు నెలల తరువాత నిన్న ఇండియా కి వచ్చిన తలైవార్ త్వరలోనే ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘రోబో-2లో’ కోటా గ్యాప్ తరువాత నటించేందుకు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాడు.

అదే క్రమంలో శంకర్ ఇప్పటి వరకు తమిళ సినిమా రంగంలో ఏ సినిమాకు పెట్టని భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘రోబో 2.0’ మార్కెట్ పై ‘కబాలి’ పరాజయం ప్రభావం తీవ్రంగా చూపెడుతుంది అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ‘కబాలి’ ఫలితం నేపధ్యంలో శంకర్ ‘రోబో-2.0’ కు హైప్‌ క్రియేట్‌ చేసినా దానిని బయ్యర్లు నమ్మరు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వీటన్నింటినీ అధిగమించి శంకర్ రజనితో రిస్క్ చేస్తాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus