Kalki 2: ఆ కామెంట్స్ విషయంలో నాగ్ అశ్విన్ జాగ్రత్త పడతారా.. రిస్క్ తీసుకుంటారా?

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ కల్కి (Kalki 2898 AD)  సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని అనిపించుకుంది. అయితే సినిమా చూసిన ప్రేక్షకులలో చాలామంది కల్కి మూవీ మ్యూజిక్, బీజీఎం విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని కామెంట్లు చేశారు. సంతోష్ నారాయణ్ (Santhosh Narayanan) ఇచ్చిన మ్యూజిక్, బీజీఎం బాగానే ఉన్నా మరీ అదుర్స్ అనేలా స్థాయిలో లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే కల్కి సీక్వెల్ కు మ్యూజిక్ డైరెక్టర్ ను మారుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి (M. M. Keeravani) కల్కి సీక్వెల్ కు పని చేసే అవకాశం ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే వైరల్ అయిన ఈ వార్తలు నిజం కాకపోవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు మాత్రం సంతోష్ నారాయణ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని నాగ్ అశ్విన్ ఆయన నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ విషయంలో రిస్క్ తీసుకుంటారా? లేక మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మార్పు చేస్తారా?

అనే ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లో సమాధానం దొరికే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు కల్కి సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తైన నేపథ్యంలో ఇప్పటికే సంతోష్ నారాయణ్ కల్కి సీక్వెల్ కు ట్యూన్స్ ఇచ్చి ఉంటే ఆయనను మార్చే అవకాశాలు దాదాపుగా ఉండవని చెప్పవచ్చు. నాగ్ అశ్విన్ సంతోష్ నే కొనసాగించవచ్చని చాలామంది నెటిజన్లు ఫీలవుతున్నారు.

మరోవైపు కల్కి సీక్వెల్ కథ ఇదేనంటూ సీక్వెల్ లో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేశారంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి సీక్వెల్ రిలీజయ్యే వరకు ఈ వార్తలు అన్నీ ఊహాగానాలే అని మరి కొందరు చెబుతున్నారు. కల్కి సీక్వెల్ రిలీజయ్యే వరకు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తరచూ చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus