Kubera: కమ్ముల కూడా సుకుమార్ లా తయారయ్యాడే..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ కుబేర (Kubera)  షూటింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. ధనుష్ (Dhanush) , నాగార్జున (Nagarjuna) కలయికలో రూపొందుతున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ను తెచ్చుకుంది. అయితే ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇవ్వకపోవడం ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది. ఇదంతా దర్శకుడు శేఖర్ కమ్ముల  (Sekhar Kammula)  రాజీపడని ధోరణే కారణమని టాలీవుడ్ టాక్. టాలీవుడ్‌లో మేకర్స్ సాధారణంగా ప్రీ-ప్లాన్ చేసుకుని ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటాం. కానీ కొందరు దర్శకులు అనుకున్నది స్క్రీన్‌పై ఖచ్చితంగా తేల్చాలనే పట్టుదలతో ప్రాజెక్ట్‌లను చాలా సమయంగా నడుపుతుంటారు.

Kubera

ఇదే విషయం పుష్ప 2 (Pushpa 2: The Rule) విషయంలోనూ జరిగింది. సుకుమార్ (Sukumar) స్క్రిప్ట్‌ను పదేపదే మార్చడం, తన విజన్‌కు తగ్గట్టుగా అవుట్‌పుట్ వచ్చేలా మేకింగ్‌పై పూర్తిగా కంట్రోల్ పెట్టడం వల్లే సుకుమార్ షూటింగ్ వర్క్ ఆలస్యం చేసినట్లు టాక్. ఇప్పుడు అదే బాటలో శేఖర్ కమ్ముల కూడా నడుస్తున్నాడట. ఈ సినిమా కథలో ధనుష్ ఓ బిచ్చగాడిగా మొదలై, వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించే మార్గాన్ని చూపించనున్నారు.

అయితే అతని వెనకాల నాగార్జున లీడ్ చేసే సీబీఐ టీమ్ మొత్తం ఎలా ఫాలో అవుతుంది అనే థీమ్ ఆసక్తికరంగా ఉంటుందట. తొంబై దశకానికి చెందిన సెట్టింగ్స్‌ను పర్ఫెక్ట్‌గా ఆవిష్కరించడానికి శేఖర్ కమ్ముల అత్యంత కేర్ తీసుకుంటున్నారు. అందుకే పనులు మరింత ఆలస్యమవుతున్నాయట. ఇప్పటి వరకూ కనీసం ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయకపోవడం చూస్తుంటే, ప్రొమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది.

తమిళంలోనూ ధనుష్ మార్కెట్ స్ట్రాంగ్ కావడంతో, క్లాష్‌లను ఎస్కేప్ చేసేలా సాలిడ్ డేట్ దొరికే వరకు మేకర్స్ వెయిట్ చేస్తున్నారట. అయితే అలా లేట్ చేయడం ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక కుబేర ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ప్రశ్నకు సరైన క్లారిటీ రాలేదు. మార్చి అన్నారు కానీ అది సాధ్యం కాదు. ఏప్రిల్‌కి వస్తే ప్రొమోషన్స్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి. లేకపోతే ఆలస్యం ఫలితాలపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus