టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ పలు సినిమాలకు మాటల రచయితగా మరికొన్ని సినిమాలకు కథా రచయితగా పని చేసి ఆ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. మిర్చి సినిమాతో దర్శకుడిగా కొరటాల శివ కెరీర్ మొదలైంది. తొలి సినిమాతోనే దర్శకునిగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం కావడం కొరటాల శివ కెరీర్ కు ప్లస్ అయింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత కొరటాల శివ మహేష్ హీరోగా శ్రీమంతుడు సినిమాను తెరకెక్కించారు.
శ్రీమంతుడు సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు అటు మహేష్ ఇటు కొరటాల శివపై ఊహించని స్థాయిలో ప్రశంసలు రావడానికి కారణమైంది. మూడో సినిమాగా ఈ దర్శకుడు జనతా గ్యారేజ్ సినిమాను తారక్ తో తెరకక్కించి ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్ విజయాల తర్వాత మహేష్ తో మరో సినిమాను తెరకెక్కించిన కొరటాల శివ భరత్ అనే నేను సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.
వరుసగా కొరటాల శివ తెరకెక్కించిన నాలుగు సినిమాలు ఆయనపై ప్రశంసలు రావడానికి కారణం కాగా ఆచార్య సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచి కొరటాల శివను, కొరటాల శివ అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఆచార్య సినిమా విషయంలో కొరటాల శివ చెప్పింది ఫాలో అయ్యానని చెప్పుకొచ్చారు. అయితే కొరటాల శివ సైతం ఈ సినిమా ఫ్లాప్ గురించి స్పందిస్తే బాగుంటుంది.
రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఇలా ఒకరిద్దరు మినహా మిగతా డైరెక్టర్లు డైరెక్షన్ చేసిన సినిమాలలో కచ్చితంగా ఫ్లాప్ లున్నాయి. ఆచార్య సినిమా ఫ్లాపైనంత మాత్రాన కొరటాల శివ కెరీర్ కు ఎటువంటి ఇబ్బంది లేదు. కొరటాల శివతో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు. అయితే తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ సక్సెస్ లను సొంతం చేసుకుని కొరటాల శివ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. కొరటాల ఆచార్య రిజల్ట్ గురించి స్పందించాలని కొరటాల మౌనం వల్ల ఆయన కెరీర్ కు నష్టం కలుగుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.