ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 8మంది ఉన్నారు. వీరిలో ఈవారం ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. కొంతమందికి ఓటింగ్ ప్రకారం డౌట్ లేదు. అయితే, ఈసారి నామినేషన్స్ లోకి ఎవరు వస్తారు అనేదానిపైనే టాప్ 5 అనేది ఆధారపడి ఉంది. ప్రస్తుతం పింకీ, సిరి , కాజల్, రవి నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. మానస్ కెప్టెన్ కాబట్టి ఈసారి నామినేషన్స్ లోకి రాలేదు. అయితే, ఇక్కడే తదుపరి వారం అంటే 13వ వారం ఖచ్చితంగా మానస్ నామినేషన్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈవారం సిరి లేదా పింకీలలో ఒకరు ఎలిమినేట్ అయ్యారనుకున్నా, నెక్ట్స్ వీక్ నామినేషన్స్ లోకి ఎవరు వస్తారు అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.
దీన్ని బట్టే టాప్ 5 ఆధారపడి ఉంటుందంటున్నారు బిగ్ బాస్ లవర్స్. ఒకవేళ సిరి ఈవారం సేఫ్ అయ్యి, పింకీ వెళ్లిపోతే మాత్రం ఆట ఇంకా రసవత్తరంగా మారుతుంది. ఎందుకంటే, 13వ వారం ఖచ్చితంగా రేస్ టు ఫినాలే టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్ లో సిరి ఫినాలే టిక్కెట్ పొందితే టాప్ 5 అనేది పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మానస్, రవి, కాజల్ ముగ్గురూ డేంజర్ జోన్లోనే ఉంటారు. వీరిలో ఓటింగ్ ప్రకారం చూస్తే కాజల్ ఆవారం వీక్ కంటెస్టెంట్ గా అవుతుంది. కానీ, అన్ అఫీషయల్ పోలింగ్స్ లో చూస్తే గత కొన్ని వారాలుగా కాజల్ మానస్ ని దాటేసింది. అప్పుడు మానస్ డేంజర్ జోన్ లో ఉంటాడు.
ఎందుకంటే, రవికి స్టాండర్డ్ ఓటింగ్ అనేది జరుగుతోంది కాబట్టి. ఇక్కడే సిరి కూడా నామినేషన్స్ లో ఉంటే షణ్ముక్ ఓట్లు సిరికి పడతాయి. ఎందుకంటే, షణ్ముక్ ఈవారం కెప్టెన్ కాబట్టి నెక్ట్స్ వీక్ నామినేషన్స్ లో ఉండడు. సో, సిరి ఆవారం సేఫ్ అయిపోతుంది. అప్పుడు మిగిలేది మానస్ మాత్రమే. మానస్ ఎలిమినేట్ అయిపోతుంటే సన్నీ ఎవిక్షన్ పాస్ వాడితే ఖచ్చితంగా సేఫ్ అవుతాడు లేదంటే టాప్ – 5లో ఉండడు.ఒకవేళ 13వ వారం సేఫ్ అయినా కూడా ఆ తర్వాత వారం మానస్ కి కష్టమే అంటున్నారు నెటిజన్స్.
ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం మేల్ కంటెస్టెంట్స్ అందరిలో లీస్ట్ లో మానస్ ఉంటున్నాడని ఈ మాట చెప్తున్నారు. అప్పుడు అన్ అఫీషియల్ ఓటింగ్ ప్రకారం చూస్తే మానస్, ఇంకా రవి ఇద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్లే లెక్క. ఎందుకంటే, షణ్ముక్ ఈవారం కెప్టెన్ అయ్యాడు కాబట్టి సేఫ్ గానే ఉంటాడు. నెక్ట్స్ రెండు వీక్స్ నామినేషన్స్ లోకి వచ్చినా కూడా షణ్ముక్ కి ఢోకా లేదు. అలాగే, రేస్ టు ఫినాలే టిక్కెట్ ఫిమేల్ కంటెస్టెంట్స్ లో ఎవరైనా గెలిస్తే మాత్రం ఆట రసవత్తరంగా మారుతుంది. లేదంటే మాత్రం ఐదుగురు ఈసారి మేల్ కంటెస్టెంట్స్ మాత్రమే టాప్ 5లో ఉండాల్సి వస్తుంది. అదీ విషయం.