మెగా కాంపౌండ్ లో ఆ డైరెక్టర్లకు మళ్లీ ఛాన్స్ దక్కుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో ఎక్కువమంది సక్సెస్ అయ్యారు. మెగా హీరోలకు ఏ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తే ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడానికి మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు మరో ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రీజన్ వల్లే మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాలను తెరకెక్కించడానికి చాలామంది దర్శకులు తెగ ఆసక్తి చూపిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మెగా హీరోలకు ఫ్లాపులిచ్చిన ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు మెగా హీరోలు మళ్లీ ఛాన్స్ ఇస్తారా?

అని ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు రావడంతో పాటు కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకునిపై ఊహించని రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయనే సంగతి తెలిసిందే. వినయ విధేయ రామ సినిమా నిరాశపరిచినా అఖండ సినిమాతో బోయపాటి శ్రీను ప్రూవ్ చేసుకున్నారు. అఖండ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

ప్రస్తుతం రామ్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తూ కెరీర్ పరంగా బోయపాటి శ్రీను బిజీగా ఉన్నారు. ఈ డైరెక్టర్ కు మెగా హీరోలు మళ్లీ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాతో చిరంజీవి, చరణ్ లకు భారీ షాకిచ్చారు. కొరటాల గత సినిమాలను చూసిన ప్రేక్షకులు సైతం ఆచార్య సినిమాను చూస్తే కచ్చితంగా నిరాశకు గురవుతారు. ఈ డైరెక్టర్ కు మెగా హీరోలు మళ్లీ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. కొరటాల శివ ప్రస్తుతం తారక్ సినిమాతో బిజీగా ఉన్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus