Nani: హాయ్ నాన్న మూవీతో నాని ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయబోతున్నారా?

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. తన సినీ కెరీర్ లో నాని ఎంతోమంది కొత్త దర్శకులతో పని చేశారు. నాని కొత్త సినిమా హాయ్ నాన్న మరో 27 రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో నాని దసరాను మించిన సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తుండగా అభిమానుల ఆకాంక్ష నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

ఒకవైపు మాస్ సినిమాలలో, మరోవైపు క్లాస్ సినిమాలలో నటిస్తున్న నాని ఈ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైజాగ్ లో పుట్టి పెరిగానని విజయనగరంలో మెడిసిన్ పూర్తి చేశానని ఆయన అన్నారు. తాను ఆరో తరగతి చదివే సమయంలో ఒక కథ రాశానని ఏడో తరగగి చదివే సమయానికి డైరెక్టర్ కావాలని అనుకున్నానని శౌర్యువ్ చెప్పుకొచ్చారు.

తల్లి సూచనల ప్రకారం మెడిసిన్ పూర్తైన తర్వాత సినిమాల్లోకి వచ్చానని ఆయన కామెంట్లు చేశారు. విజయేంద్ర ప్రసాద్ దగ్గర రైటింగ్ డిపార్టుమెంట్ లో పని చేశానని శౌర్యువ్ అన్నారు. అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ కు తాను పని చేశానని శౌర్యువ్ వెల్లడించారు. హాయ్ నాన్న సినిమాలో ఎమోషన్స్ తప్ప యాక్షన్, ఇతరత్రా అంశాలు ఉండవంటూ ఈ దర్శకుడు ఒకింత షాకిచ్చారు.

వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతల ద్వారా ఈ సినిమాకు పని చేసే ఛాన్స్ దక్కిందని శౌర్యువ్ తెలిపారు. శౌర్యువ్ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. హాయ్ నాన్న మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.నిన్ను కోరి మ్యాజిక్ ను హాయ్ నాన్నతో నాని (Nani) రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus