కరోనా వలన టాలీవుడ్ మొత్తం స్థంబించిన పరిస్థితి వుంది. టాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ మొత్తం కకావికలం అయ్యింది. అనేక సినిమాలు షూటింగ్ మధ్యలో ఆపేసుకున్నాయి. మరి కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఆగిపోయాయి, ఇక టాలీవుడ్ లో లాక్ డౌన్ ముగిసిన తర్వాత మెల్లగా సినిమా షూటింగ్స్ మొదలు పెట్టాలని చూస్తున్నారు, ముందుగా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవటానికి అనుమతి రావచ్చు, ఆ తర్వాత షూటింగ్స్ కి అనుమతి ఇవ్వచ్చు, అయితే కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ షూటింగ్ చేయాలి, అదే విధంగా వయస్సు పై బడిన వాళ్ళు కొంచం జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవన్నీ ఆలోచించే టాలీవుడ్ లో సీనియర్ హీరోలు లాక్ డౌన్ తర్వాత వెంటనే షూటింగ్ కి హాజరు కాకూడదని భావించినట్లు తెలుస్తుంది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వీళ్ళందరూ కూడా 60 అటు ఇటు వున్నవాళ్లే, అందుకే ఆ నలుగురు కూడా వెంటనే షూటింగ్స్ కి హాజరు కాకూడదని అనుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ నలుగురి సినిమాలు కూడా ఒక్కో షెడ్యూలు పూర్తిచేసుకొని వున్నాయి, చిరంజీవి సినిమా అయితే మరో 40 % మాత్రమే షూటింగ్ మిగిలివుంది, బాలయ్య-బోయపాటి సినిమా ఒక షెడ్యూలు అయ్యింది.
మరోపక్క యంగ్ హీరోలు కూడా షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. పక్క ప్లాన్ ప్రకారం సన్నివేశానికి తగ్గట్లు ఎంత మంది నటి నటులు, టెక్నీషియన్లు అవసరమో గమనించి అందుకు తగ్గట్లు షెడ్యూలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఫైనల్ గా కరోనా దెబ్బ నుండి తెలుగు పరిశ్రమ ఇప్పట్లో కోలుకోవటం కష్టమే అని చెప్పాలి.
Most Recommended Video
దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు