Pallavi Prashanth: ఆ వార్తల గురించి పల్లవి ప్రశాంత్ క్లారిటీ ఇస్తారా?

  • February 8, 2024 / 05:00 PM IST

కొన్ని నెలల క్రితం వరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో సీజన్7 కు విజేతగా నిలవడం ద్వారా ఓవర్ నైట్ లో ఫేమ్, పాపులారిటీ పెంచుకున్నారు. పల్లవి ప్రశాంత్ తాను బిగ్ బాస్ విజేతగా నిలిస్తే పారితోషికాన్ని రైతులకు పంచుతానని చాలా సందర్భాల్లో వెల్లడించారు. రైతుబిడ్డ అని ప్రచారం చేసుకునే పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడానికి ఇదే కారణమని చాలామంది ఫీలవుతారు. అయితే పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి దాదాపుగా 40 రోజులు అవుతున్నా బిగ్ బాస్ రెమ్యునరేషన్ ను రైతులకు ఇచ్చినట్టు ఎలాంటి ఫోటోలు, వీడియోలు వెలుగులోకి రాలేదు.

గతంలో పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు సైతం ఇదే విధంగా హామీ ఇచ్చి మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ వైరల్ అవుతున్న వార్తల గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వివాదాలలో చిక్కుకోవడంతో వార్తల్లో నిలిచారు. ఆ వివాదాల వల్ల పల్లవి ప్రశాంత్ మీడియాకు సైతం దూరంగా ఉన్నారు.

స్టార్ మా ఛానల్ లోని కొన్ని షోలలో మాత్రమే పల్లవి ప్రశాంత్ సందడి చేస్తున్నారు. ప్రచారం జరుగుతున్న వార్తల గురించి స్పందించని పక్షంలో పల్లవి ప్రశాంత్ పై నెగిటివిటీ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. బిగ్ బాస్ షో వల్ల యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న పల్లవి ప్రశాంత్ ఇకపై మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.

పల్లవి ప్రశాంత్ కు (Pallavi Prashanth) మూవీ ఆఫర్లు వస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో సైతం నిజానిజాలు తెలియాల్సి ఉంది. పల్లవి ప్రశాంత్ శివాజీ వల్లే బిగ్ బాస్ విజేతగా నిలిచాడని చాలామంది సోషల్ మీడియాలో ఇప్పటికీ కామెంట్లు చేస్తున్నారు.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus