Pawan Kalyan: సురేందర్‌ రెడ్డి ఆ హీరోయిన్‌ని రిపీట్‌ చేస్తున్నారట!

పవన్‌ కల్యాణ్‌ సరసన కొత్త భామను చూసి ఎన్ని రోజులైంది… రోజులేంటి ఎన్నేళ్లు అయ్యింది. ఓసారి ఫిల్మోగ్రఫీ చూసి వస్తారా? మీకు అంత శ్రమ ఎందుకు లెండి మేమే చెప్పాస్తాం. పదేళ్లు దాటిపోయింది. అవును పవన్‌ సరసన కొత్తమ్మాయి నటించిన ఆఖరి సినిమా‘పంజా’. ఆ తర్వాత పవన్‌ కాస్త పేరున్న కథానాయికలతోనే నటిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు సురేందర్‌ రెడ్డి సినిమాలో కొత్త నాయికతో ఆడిపాడబోతున్నాడని టాక్‌. పవన్‌ లైనప్‌లో సురేందర్‌ రెడ్డి సినిమా ఉన్న విషయం తెలిసిందే.

రామ్‌తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతోందని టాక్‌. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఓవైపు అఖిల్ ‘ఏజెంట్‌’ పనులు చేస్తూనే… పవన్‌ సినిమా పనులు చూసుకుంటున్నాడు. కాస్ట్‌ అండ్‌ క్రూ ఎంపిక పనులు ఇప్పుడు జరుగుతున్నాయట. అందులో భాగంగా హీరోయిన్‌ టాపిక్‌ వచ్చింది. ఈ సినిమాలో పవన్‌ సరసన కొత్త భామ ఉంటే బాగుంటుందని సూరి అనుకుంటున్నారట. దాని కోసం సాక్షి వైద్య అయితే బాగుంటుందని ఆయన ఆలోచనట.

ఆమె ‘ఏజెంట్‌’ సినిమాలో హీరోయిన్‌ కదా అంటారా? ఆఁ.. ఆమెనే. ‘ఏజెంట్‌’లో ఆమె నటన చూసి ఇంప్రెస్‌ అయిన సూరి తర్వాతి సినిమాకు కూడా ఆమెనే తీసుకుంటున్నారని టాక్‌. అయితే ఈమెతోపాటు మరో సీనియర్‌ హీరోయిన్‌ కూడా ఉంటారని సమాచారం.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus