ప్రిన్స్ టార్గెట్ ని పవన్ అందుకుంటాడా!!!

టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్ట్ లో ఉంటారు….పవర్ స్టార్ పవన్ కల్యాణ్….ప్రిన్స్ మహేష్ బాబు. అయితే ఇద్దరిలో ఎవరు గొప్పా అంటే? ఎవరి అభిమానులు వారికి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అదే క్రమంలో ఫ్యాన్ ఫాలోయింగ్ విషయానికి వస్తే మాత్రం కాస్త ప్రిన్స్ వెనుక అడుగులో ఉంటాడు అనే చెప్పాలి. అదంతా పక్కన పెడితే తాజాగా పవన్, ప్రిన్స్ ఫ్యాన్స్ కు మరి సరికొత్త పోటీ మొదలవనుంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి….ఇంతకీ ఏంటి ఆ పోటీ… అంటే??? వచ్చే సమ్మర్ రేస్ లో దిగనున్న పవన్  ‘కాటమరాయుడు’ మహేష్ మురగదాస్ సినిమాల పై భారీ ఆశలు…అంచనాలే పెట్టుకున్నారు వారి అభిమానులు. అయితే ఈరెండు సినిమాలకు జరుగుతున్న బిజినెస్ ను చూస్తూ ఉంటే ‘బ్రహ్మోత్సవం’ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మహేష్ లేటెస్ట్ మూవీ బిజినెస్ పరంగా పరుగులు తీస్తూ ఉంటే పవన్ ‘కాటమరాయుడు’ మహేష్ మురగ దాస్ ల సినిమా బిజినెస్ కు దరిదాపులలో కూడ లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

అదే క్రమంలో టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం…వంద కోట్ల బడ్జెట్లో తీస్తున్న ప్రిన్స్ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ 150 కోట్లను టచ్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ  ఈ సినిమా నాన్ ‘బాహుబలి’ రికార్డుల్ని మహేష్ కొల్లగొట్టేయబోతున్నాడు. అన్న కామెంట్స్ వినిపిస్త్తున్నాయి. అయితే…క్రేజ్ పరంగా అభిమానుల ఫాలోయింగ్ రీత్యా మహేష్  కన్నా ఎంతో ముందు స్థాయిలో ఉండే పవన్ ‘కాటమరాయుడు’ బిజినెస్ మహేష్ మురగదాస్  మూవీ బిజినెస్ తో పోల్చుకుంటే చాలా తక్కవ  స్థాయిలో అవుతూ ఉండటంతో  మహేష్ టార్గెట్ ను పవన్ అందుకోగలడో లేదో అన్న ఆలోచన పవన్ అభిమానుల్లో మొదలయింది…ఈ సినిమా కాకపోయినా…తాజాగా మొదలయిన పవన్- త్రివిక్రమ్ ల సినిమా అయినా ప్రిన్స్ రికార్డ్స్ ను తిరగరాస్తుంది అన్న ఆశతో ఉన్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus