Prashanth Neel: ప్రశాంత్ నీల్ మరో సుకుమార్ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్…
- October 12, 2026 / 10:24 AM ISTByFilmy Focus Desk
సినిమాను డైరెక్ట్ చేయడం వేరు.. ఆ సినిమా కథను నమ్మి నిర్మాతగానో, సమర్పకుడిగానో ఉండటం వేరు. తొలి పని ఫలితం తన ఆలోచన, కష్టం మీద ఆధారపడి ఉంటుంది. రెండో పని ఇతర వ్యక్తుల కష్టం, ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. తొలి పనిలో సక్సెస్ అయిన వారు.. రెండో పనిలో అవుతారు అని చెప్పలేం. అలా రీసెంట్ టైమ్స్‌లో టాలీవుడ్‌లో కొంతమంది దర్శకులు నిర్మాతగా/ సమర్పకుడిగా మారి తమ అదృష్టం పరీక్షించుకున్నారు. అందులో చాలా శాతం వ్యతిరేక ఫలితాలు పొందినవారే.
Prashanth Neel
ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అంటే.. దర్శకులుగా భారీ విజయాలు, భారీ సినిమాలు తీసిన వారు.. నిర్మాతగా/ సమర్పకుడిగా ఆ జడ్జిమెంట్ మిస్ అయి.. నిర్మాణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక దర్శకుడి గురించి చెప్పుకోవాలి. ఆయన అటు దర్శకత్వంలో, ఇటు నిర్మాణంలో విజయాలు సాధిస్తున్నారు. ఆయనే సుకుమార్. ఇప్పుడు ఆయన శైలిలో మరో దర్శకుడు విజయాలు అందుకుంటారా అనేది ఇప్పుడు చర్చ.
మాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన ‘రొమాంచకం’, దర్శక ధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వచ్చిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు అందుకోలేదు. వారి స్టార్ డైరక్టర్ ఇమేజ్ ఆ సినిమాలకు పని చేయలేదు. దీంతో ఇప్పుడు నిర్మాతగా మారుతున్న ప్రశాంత్ నీల్ వైపు అందరి దృష్టి మళ్లింది. ‘కేజీయఫ్’, ‘సలార్’ సినిమాలకు పని చేసిన కీర్తన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘418’ అనే హారర్ థ్రిల్లర్ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు ప్రశాంత్ నీల్.
అక్టోబర్ 23న విడుదల కాబోతున్న ఈ సినిమా మెడికల్ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సైన్స్, మూఢనమ్మకాల మధ్య సాగే కథతో తెరకెక్కింది. ఈ సినిమా ఫలితంతో దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా హిట్ అని ఆయన నిరూపించుకోవాలి. అన్నట్లు హిట్ మెషీన్ అనే పేరున్న అనిల్ రావిపూడి సైతం ‘గాలి సంపత్’ సినిమా సమర్పకుడిగా వ్యవహరించి పరాజయం మూటగట్టుకున్నారు. ఈ లిస్ట్‌లో ఇంకొంతమంది దర్శకులు ఉన్నా.. రీసెంట్‌గా అయితే వీళ్లే.











