RRR, Pushpa2: రాజమౌళి రికార్డులను బ్రేక్ చేయడం సుకుమార్ కు సాధ్యమవుతుందా?

  • March 17, 2023 / 02:12 PM IST

ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో బాక్సాఫీస్ ను ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీలో అద్భుతమైన స్క్రీన్ ప్లేకు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఫుల్ రన్ లో ఈ సినిమా 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. నిర్మాత దానయ్యకు ఈ సినిమాతో ఊహించని రేంజ్ లో లాభం వచ్చింది.

రాజమౌళి పాపులారిటీని ఈ సినిమా రెట్టింపు చేసిందనే సంగతి తెలిసిందే. అయితే పుష్ప2 మూవీ ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను టార్గెట్ గా పెట్టుకుందని తెలుస్తోంది. పుష్ప1 కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా తెరకెక్కుతోందని స్క్రీన్ ప్లే లో ఊహించని ట్విస్టులు ఈ సినిమాకు ప్లస్ కానున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మైత్రీ నిర్మాతలు ఈ సినిమా కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని సమాచారం. పుష్ప2 సినిమా బాలీవుడ్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడం సుకుమార్ కే సాధ్యమవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పుష్ప1 లో డీ గ్లామరస్ లుక్ లో కనిపించిన బన్నీ పుష్ప2 సినిమాలో మాత్రం రిచ్ లుక్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో రష్మిక రోల్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

రష్మిక ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రష్మిక కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగటంతో పాటు మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రష్మిక ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus