Salaar: ప్రభాస్ సలార్ మూవీ ఆ రికార్డును సొంతం చేసుకుంటుందా?

  • June 18, 2023 / 07:49 PM IST

బాహుబలి, బాహుబలి2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆదిపురుష్ సినిమా యావరేజ్ టాక్ తో ప్రదర్శితం అవుతుండగా ప్రభాస్ సలార్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. సలార్ సినిమా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అయితే సలార్ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ వల్ల ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం సలార్ సినిమాలో యశ్ కూడా కనిపిస్తారట. ఈ సినిమాలో యశ్ పాత్ర పరిమితం అయినా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని సమాచారం. కేజీఎఫ్ సిరీస్ కు, సలార్ కు లింక్ ఉంటుందని బోగట్టా. రాఖీ భాయ్ కు సలార్ మాటిచ్చాడని రాఖీ భాయ్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది.

సలార్ (Salaar) సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ సినిమాలో మాస్, యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఆద్య అనే కీలక పాత్రలో శృతి హాసన్ నటిస్తున్నారు.

శృతి హాసన్ ప్రస్తుతం 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. శృతి హాసన్ కు, ప్రభాస్ కు రాబోయే రోజుల్లో కూడా విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సలార్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus