తెలుగులో సమంత ఆ ప్రయోగం చేస్తుందా?

సమంత ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. చెప్పాలంటే..పెళ్ళైన తరువాతే లేడీ సూపర్ స్టార్ రేంజ్ కు సమంత ఎదిగిందని చెప్పాలి. పెళ్ళైతే హీరోయిన్లకు లైఫ్ ఉండదు అనే సెంటిమెంట్ ను కూడా సమంత బ్రేక్ చేసింది. కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. బ్లాక్ బస్టర్లు అందుకుంది మన అక్కినేని వారి ఇంటికోడలు. ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సమంత అతి త్వరలో ‘ఫ్యామిలీ మెన్ సీజన్ 2’ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టనుంది.

ఈ వెబ్ సిరీస్ లో ఈమె ఓ టెర్రరిస్ట్ పాత్ర పోషిస్తుందని వినికిడి. ప్రత్యేకంగా ఈ వెబ్ సిరీస్ కోసం జిమ్ లో ఎన్నో వర్కౌట్లు చేసిందట సమంత. ఈ వెబ్ సిరీస్ లో ఎన్నో యాక్షన్ ఎపిసోడ్స్ లో సమంత కనిపించిందట. డూప్ లేకుండా ఈ యాక్షన్ సెక్వెన్స్ లో పాల్గొందని కూడా సమాచారం. అయితే బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి ఇదొక మంచి అవకాశం అని సమంత.. ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకుందా లేక సౌత్ లో కూడా మంచి కథ దొరికితే వెబ్ సిరీస్ లలో నటిస్తుందా అనే డిస్కషన్లు ఇప్పుడు మొదలయ్యాయి.

ఇలాంటి స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ లలో నటిస్తే కచ్చితంగా.. ఓటిటి ల డిమాండ్ కూడా పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఇప్పుడు వెబ్ సిరీస్ లను రూపొందించడానికి ముందుకు వస్తున్నారు. మరి అలాంటి వాళ్లకు సమంత ఛాన్స్ లు ఇస్తుందా? లేక బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో మాత్రమే కంటిన్యూ అవుతుందా? అనేది చూడాల్సి ఉంది.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus