Sekhar kammula: ఈ హీరోయిన్ జాతకాన్ని శేఖర్ కమ్ముల మారుస్తారా..?

  • April 3, 2021 / 03:45 PM IST

తెలుగమ్మాయి కాకపోయినా తెలుగులో ఒకే ఒక్క సినిమాతో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్నారు సాయిపల్లవి. ఫిదా సినిమాతో గుర్తింపును సంపాదించుకున్న సాయిపల్లవి అందం, అభినయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలను నిజంగా ఫిదా చేశారు. గ్లామర్ షోకు దూరంగా ఉండే సాయిపల్లవి తన సినీ కెరీర్ లో మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలనే ఎక్కువగా ఎంచుకున్నారు. అయితే సాయిపల్లవి ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫిదా తరువాత సాయిపల్లవి కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నా ఫిదా రేంజ్ సక్సెస్ మాత్రం లేదు.

లవ్ స్టోరీ సినిమాతో సాయిపల్లవి కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల వైష్ణవ్ తేజ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పటికే నాని గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమాలు సక్సెస్ కాలేదు. అందం, అభినయం ఉన్న ప్రియాంక నటించబోయే సినిమాలు సక్సెస్ అయితే ఆమెకు స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ప్రియాంక శేఖర్ కమ్ముల సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ప్రియాంక అరుళ్ మోహన్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటిస్తే మాత్రం ఆమె జాతకం ఖచ్చితంగా మారుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సారంగదరియా పాట వల్ల లవ్ స్టోరీ సినిమాపై అంచనాలు పెరగగా లవ్ స్టోరీ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని శేఖర్ కమ్ముల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus