బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్ ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్ గా వరుస అవకాశాలను సొంతం చేసుకోవడంతో పాటు పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈటీవీలో ఢీ డ్యాన్స్ షోతో పాటు స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోకు శేఖర్ మాస్టర్ ప్రస్తుతం జడ్జిగా ఉన్నారు. ఈ రెండు షోలు బుల్లితెరపై మంచి టీఆర్పీ రేటింగ్ లు అందుకుంటూ ఉండటం గమనార్హం.
అయితే కామెడీ స్టార్స్ షోలో తాను పడిన కష్టాల గురించి శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు. ప్రోగ్రామ్ లో అవినాష్ చేసిన ఒక స్కిట్ ను చూసిన తరువాత శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. తాను మాట్లాడలేకపోతున్నానంటూ శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పాతరోజులు గుర్తుకువచ్చాయని అప్పట్లో తనకు 75 రూపాయలు ఇచ్చేవారని శేఖర్ మాస్టర్ అన్నారు. తినడానికి తిండి ఉండేది కాదని శేఖర్ మాస్టర్ తన దీనస్థితిని వెల్లడించారు. తనకు నోటిలో మాటలు రావట్లేదని శేఖర్ మాస్టర్ తెలిపారు.
అయితే ఇప్పుడు మాత్రం శేఖర్ మాస్టర్ ఒక్కో పాటకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఢీ 13 షోలో మాత్రం ఈ మధ్య కాలంలో శేఖర్ మాస్టర్ కనిపించడం లేదు. కామెడీ స్టార్స్ షోలో కనిపిస్తూ ఢీ షోలో శేఖర్ మాస్టర్ కనిపించకపోవడంతో శేఖర్ మాస్టర్ ఆ షో నుంచి తప్పుకున్నారా..? అని కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగా శేఖర్ మాస్టర్ ఆ షో నుంచి తప్పుకున్నారో లేదో తెలియాల్సి ఉంది.
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!