కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఎందుకంటే ‘ఖైదీ’ ‘విక్రమ్’ వంటి సినిమాలతో అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అలాంటి దర్శకుడు రజినీకాంత్ ను హీరోగా పెట్టి కింగ్ నాగార్జునని విలన్ గా మార్చి ఒక సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు మామూలుగా ఉంటాయా?
పైగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అందులో స్పెషల్ రోల్స్ చేస్తున్నారు అంటే అంచనాలు ‘స్కై ఈజ్ ది లిమిట్’ అన్నట్టు ఉంటాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఆగస్టు 14న వచ్చిన ‘కూలీ’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని అందుకోవడంలో ‘కూలీ’ విఫలమయ్యింది. హైప్ వల్ల వీకెండ్ వరకు ఓపెనింగ్స్ బాగా వచ్చినా…వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. ఈ వీకెండ్ బాగా క్యాష్ చేసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి ‘కూలీ’ 8 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 14.47 cr |
సీడెడ్ | 5.83 cr |
ఉత్తరాంధ్ర | 4.97 cr |
ఈస్ట్ | 2.62 cr |
వెస్ట్ | 2.16 cr |
గుంటూరు | 2.71 cr |
కృష్ణా | 2.48 cr |
నెల్లూరు | 1.46 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 36.7 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) | 2.45 cr |
ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 3.25 cr |
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) | 42.4(షేర్) |
‘కూలీ'(తెలుగు వెర్షన్) చిత్రానికి రూ.46.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.42.4 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.73.65 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 4.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.