Sivakarthikeyan: చరణ్‌ అయిపోయింది… ఇప్పుడు శివ కార్తికేయన్‌ వచ్చాడు… ఏదో ఒకటి చెప్పు ‘లియో’

లోకేశ్‌ కనగరాజ్‌… ఏ ముహూర్తాన కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమాలో సూర్యను అతిథి పాత్రలో చూపించారో కానీ.. ఆయన ‘లియో’ సినిమా విషయంలో అతిథి పాత్రల రూమర్లు వస్తూనే ఉన్నాయి. కావాలంటే మీరే చూడండి… ‘లియో’ సినిమాలో ఆ హీరో ఉన్నాడు, ఈ హీరో ఉన్నాడు అంటూ ఏవో ఒకటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో హీరో పేరు ఈ సినిమాకు లింక్‌ చేసి వినిపిస్తోంది. ఈసారి ఆ హీరో తమిళనాటకు చెందినవాడే. అయితే దీనిపై క్లారిటీ కూడా వచ్చేసింది.

‘మా వీరన్‌’ సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నాడు (Sivakarthikeyan) శివ కార్తికేయన్‌. ఇప్పుడు ఆయన గురించి, ఆయన సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆయన ‘లియో’లో నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి కాబట్టి. విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగారాజ్‌ తెరకెక్కిస్తున్న ‘లియో’లో శివ కార్తికేయన్‌ కనిపిస్తాడనే పుకార్లు వచ్చాయి. అయితే దీని వెనుక కారణం కూడా తెలిసింది. దీనికి కారణం మరో సినిమా షూటింగ్‌ అని అంటున్నారు.

‘లియో’ సినిమా చిత్రీకరణ ఇటీవల కశ్మీర్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో శివ కార్తికేయన్‌ కొత్త చిత్రం షూటింగ్‌ కూడా అక్కడే జరిగింది. ఈ క్రమంలో రెండు సినిమాల టీమ్‌, హీరోలు కలుసుకున్నారట. ఆ విషయం ఆ నోట, ఈ నోట పడి.. ఆఖరికి ‘లియో’ సినిమాలో శివకార్తికేయన్‌ నటిస్తున్నాడని కొంతమంది భావించారు. కానీ ఇప్పుడు అది నిజం కాదని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

ఇప్పటికే ఈ సినిమాలో రామ్‌చరణ్‌ నటిస్తున్నాడు అంటూ పుకార్లు వచ్చాయి. ఈ సినిమాతో లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎల్‌సీయూ)లో చరణ్‌ కూడా భాగమవుతున్నాడు అంటూ లెక్కలేసేశారు. దీని కారణం ఇటీవల లోకేశ్‌ను, విజయ్‌ని చరణ్‌ కలవడమే అని కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత ఈ కలయిక కారణం వేరని తేలింది. దీంతో ఆ పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఇంకా ఈ సినిమా వచ్చేలోపు ఇలాంటి పుకార్లు ఇంకెన్ని వస్తాయో చూడాలి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus