మాస్ ఆడియన్స్ ఆకలి తీర్చే సినిమాలు తీస్తే కొత్త రికార్డులు క్రియేటవుతాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మాస్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కేవి. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లలో మాస్ సినిమాలు ముందువరసలో ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా దర్శకులు (Directors) సైతం మారుతుండటంతో ప్రస్తుతం మాస్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కడం లేదు. మాస్ ప్రేక్షకుల ఆకలిని తీర్చే సినిమాలు చాలా తక్కువగా మాత్రమే తెరకెక్కుతున్నాయి. అయితే ఈ తరం ప్రేక్షకులకు నచ్చేలా మాస్ సినిమాలు తెరకెక్కిస్తే సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని సలార్ (Salaar), దేవర(Devara) ప్రూవ్ చేశాయనే సంగతి తెలిసిందే.

Star Directors

మాస్ ఆడియన్స్ ఆకలి తీర్చే సినిమాలు తీస్తే కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. స్టార్ డైరెక్టర్లు (Directors) తమ సినిమాలలో మాస్ ఎలిమెంట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినా నష్టం అయితే లేదు. అయితే కథనం విషయంలో పొరపాట్లు జరగకుండా కొత్తగా కథనాన్ని రాసుకుంటే మంచిదని చెప్పవచ్చు. దేవర సినిమా సెకండ్ వీకెండ్ సమయానికి అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

దేవర సినిమాలో ఎన్టీఆర్  (Jr NTR)   యాక్టింగ్ స్కిల్స్ కు మాత్రం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దేవర సినిమాలో దేవర పాత్ర మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అనిరుధ్ పేరు సైతం సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది. అనిరుధ్  (Anirudh Ravichander) ఈ సినిమా కోసం 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకొగా ఈ మూవీ బీజీఎం కోసం అనిరుధ్ ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది.

మాస్ సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు సాధారణం అని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు డిమాండ్ పెరగడం పక్కా అని చెప్పవచ్చు. అనిరుధ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో టాలీవుడ్ లో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గేమ్ ఛేంజర్ టీజర్ విషయంలో ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus