Tollywood: ఈ టాలీవుడ్ స్టార్స్ తర్వాత సినిమాలతో రికార్డులు క్రియేట్ చేస్తారా?

గత కొన్నేళ్లలో టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికం ఊహించని రేంజ్ లో పెరిగింది. కొంతమంది స్టార్ హీరోలు వేగంగా సినిమాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుండగా మరి కొందరు స్టార్ హీరోలు మాత్రం రెండేళ్లకు, మూడేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్నారు. కొందరు స్టార్ హీరోలు నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని ఫాలో అవుతుండగా మరి కొందరు స్టార్స్ మాత్రం ఆలస్యం అమృతం విషం అనే సూత్రాన్ని ఫాలో అవుతుండటం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఈ నాలుగు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమాలలో కొన్ని (Tollywood) సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ సమయానికి ఈ నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరో స్టార్ హీరో ప్రభాస్ ఏకంగా ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవుతుండగా వచ్చే ఏడాది మరో రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

వేగంగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఎక్కువ సినిమాలు యాక్షన్ సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే తారక్ సైతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. తారక్ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఒక సినిమా పూర్తైన తర్వాత మరో సినిమా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ఆయన ప్రకటించనున్నారని తెలుస్తోంది.

రవితేజ, నితిన్, కళ్యాణ్ రామ్ రెండు ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఈ హీరోల తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు ఏర్పడ్డాయి. మిడిల్ రేంజ్ హీరోలు సైతం కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ తమ సినిమాల బడ్జెట్ పెరిగేలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం సంచలనాలు సృష్టించి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus