Guntur Kaaram: గుంటూరు కారం ఓటీటీ వెర్షన్ లో ఆ సీన్లను యాడ్ చేయడం వీలవుతుందా?

  • January 31, 2024 / 01:16 PM IST

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా యావరేజ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతికి విడుదలైన టైర్1 హీరో సినిమా కావడం, మహేష్ నుంచి మరో సినిమా రావడానికి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ సినిమాకు భారీ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. అయితే గుంటూరు కారం ఓటీటీ వెర్షన్ లో అదనపు సీన్లను యాడ్ చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

గుంటూరు కారం సినిమాకు సంబంధించి తీసిన ఫుటేజ్ తో పోల్చి చూస్తే రిలీజైన వెర్షన్ లో చాలా సీన్స్ లేవు. అందువల్ల కొన్ని సీన్స్ ను ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేయడం ద్వారా ఓటీటీ వెర్షన్ కు బెటర్ రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రెండు కీలకమైన సీన్స్ సినిమాలో లేవని ఆ సీన్స్ యాడ్ అయితే ఓటీటీ వెర్షన్ వ్యూస్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు.

అయితే సెన్సార్ నిబంధనల వల్ల కొన్ని (Guntur Kaaram) సినిమాలకు సంబంధించి ఓటీటీ వెర్షన్ లో అదనపు సీన్లను యాడ్ చేయడం కుదరడం లేదు. గుంటూరు కారం మూవీ విషయంలో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాల ఓటీటీ డీల్స్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఏ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో తెలియాల్సి ఉంది.

సంక్రాంతి నాలుగు సినిమాల డిజిటల్ హక్కులను వేర్వేరు ఓటీటీలు కొనుగోలు చేయడం గమనార్హం. హనుమాన్ సినిమా ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా మిగతా సినిమాల ఓటీటీ డీల్స్ గురించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఏడాది ప్రతి పండుగకు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus