ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించేవి. టాలీవుడ్ ప్రేక్షకులు సైతం బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. అయితే గత కొన్నేళ్లలో బాలీవుడ్ పరిస్థితి పూర్తిస్థాయిలో మారిపోయింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలలో నాసిరకం సన్నివేశాలతో తెరకెక్కుతున్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో పని చేస్తున్నా మెజారిటీ సందర్భాల్లో నిరాశజనకమైన ఫలితాలు ఎదురవుతూ ఉండటం గమనార్హం.
భవిష్యత్తులో బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిదని చెప్పవచ్చు. హిందీ డైరెక్టర్ల డైరెక్షన్ లో పని చేసిన హీరోలు విమర్శల పాలవుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్లు కథ, కథనం కంటే ఇతర విషయాలపై అధిక శ్రద్ధ పెడుతుండటంతో సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోవడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కామెంట్లపై బాలీవుడ్ డైరెక్టర్ల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. (Tollywood) టాలీవుడ్ డైరెక్టర్లు పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం పరువు తీస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాల హవా నేపథ్యంలో హీరోలు కథల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ సినిమాల బడ్జెట్ల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమని చెప్పవచ్చు. బడ్జెట్లు శృతి మించితే నిర్మాతలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. మరీ రిస్కీ ప్రాజెక్ట్ లకు నిర్మాతలు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు భారీ అంచనాలతో తెరకెక్కుతున్నాయి.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్