Nani: టాలీవుడ్ స్టార్స్ అలా చేస్తే మాత్రం బ్లాక్ బస్టర్ గ్యారంటీ!

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన నాని దసరా సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఫస్ట్ వీకెండ్ లో రికార్డ్ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోగా వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. అయితే భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే నాని నటించిన దసరా ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి ప్రమోషన్స్ కారణమని చెప్పవచ్చు.

భాషతో సంబంధం లేకుండా నాని (Nani) ప్రమోషన్స్ చేయడం వల్లే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టికి వెళ్లి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సాధ్యమైంది. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం భాషతో సంబంధం లేకుండా ప్రమోషన్స్ చేస్తే సినిమాలకు కచ్చితంగా ప్లస్ అవుతుంది. హిందీలో కూడా దసరా సినిమా కలెక్షన్లు పుంజుకుంటున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

దసరా సక్సెస్ తో శ్రీకాంత్ ఓదెలకు కొత్త సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల స్టార్ హీరోల సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తే ఈ దర్శకుని రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. శ్రీకాంత్ ఓదెల రెమ్యునరేషన్ ఊహించని రేంజ్ లో పెరిగిందని బోగట్టా. చాలామంది నిర్మాతలు శ్రీకాంత్ ఓదెలకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ను ఆఫర్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

శ్రీకాంత్ ఓదెల రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. శ్రీకాంత్ ఓదెల కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని గురువును మించిన శిష్యుడు కావాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. దసరా డైరెక్టర్ కు దసరా నిర్మాత నుంచి కారు బహుమతిగా అందింది. దసరా ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus