త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ మూవీ కొరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పదేళ్ల గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుండగా అటు మహేష్ ఇటు త్రివిక్రమ్ సక్సెస్ లో ఉండటంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే నెలలో భీమ్లా నాయక్ సినిమా విడుదల కానుండగా ఈ సినిమా రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ సినిమా షూటింగ్ పనులు మొదలయ్యే ఛాన్స్ ఉంది.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పటికే మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ మ్యూజిక్ పనులను మొదలుపెట్టారు. ఈ సినిమాలో విలన్ కూడా దాదాపుగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. తెలుగులో మోసగాళ్లు సినిమాలో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న సునీల్ శెట్టి ఈ సినిమాలో విలన్ గా నటించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. సునీల్ శెట్టి ఈ సినిమాలో నటిస్తే బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.
బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటించిన సునీల్ శెట్టి ప్రస్తుతం సౌత్ సినిమా నుంచి వస్తున్న ఆఫర్లలో మంచి ఆఫర్లను ఎంపిక చేసుకుంటున్నారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కి త్వరలో రిలీజ్ కానున్న గని సినిమాలో కూడా సునీల్ శెట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే మోసగాళ్లు ఫ్లాప్ కావడంతో మహేష్ అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ కాబట్టి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు
మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంటుంది. మహేష్ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట ఏప్రిల్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆచార్య, సర్కారు వారి పాట ఒకేరోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మహేష్ బాబు సమ్మర్ లోనే సర్కారు వారి పాట సినిమాను కచ్చితంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
Most Recommended Video
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!