Jr NTR: ఎన్టీఆర్ వల్ల ‘వార్ 2’ డిలే అవుతుందా?

‘బ్రహ్మాస్త్రం’ దర్శకుడు అయాన్ ముఖర్జీతో ఎన్టీఆర్ ‘వార్ 2’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మెయిన్ హీరోగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ .. హృతిక్ తో సమాంతరమైన పాత్రని పోషిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ‘యుద్ధభూమిలో నీకోసం ఎదురుచూస్తుంటాను’ అంటూ స్వయంగా హృతిక్ రోషన్ … ట్వీట్ ఏసీ ఆ ప్రాజెక్టు గురించి ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు క్లారిటీ ఇచ్చాడు.

అయితే ప్రస్తుతం (Jr NTR) ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మొదటి భాగంలో నటిస్తున్నాడు. మొదట ఈ ప్రాజెక్టుని కొరటాల రెండు భాగాలుగా అనుకోలేదు. కానీ బడ్జెట్ పెరిగిపోతుండటంతో .. రెండు పార్టులు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని వల్ల ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టులకు ఇబ్బందే కదా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ స్ట్రైట్ బాలీవుడ్ మూవీ ‘వార్ 2 ‘ డిలే అవుతుందేమో అని అంతా కంగారు పడుతున్నారు.

కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ‘డిసెంబర్ నుండి ‘వార్ 2 ‘ షూటింగ్ ప్రారంభమవుతుందట. ముందుగా హృతిక్ రోషన్ తో షెడ్యూల్ తీసే ప్లాన్ లో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ షెడ్యూల్ జనవరి వరకు ఉండొచ్చు. ఇక రెండో షెడ్యూల్ ఫిబ్రవరి టైంలో మొదలవ్వచ్చు. అప్పటికి ‘దేవర 1 ‘ లో భాగంగా ఎన్టీఆర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ వెంటనే ‘వార్ 2 ‘ షూటింగ్లో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడన్న మాట.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus