ఈ నెల 24న రిలీజ్ కానున్న `విన్న‌ర్`

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం `విన్న‌ర్‌`. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఈ సినిమా రూపొందుతోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు. ఒక పాట మిన‌హా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ఆధ్వ‌ర్యంలో రీరికార్డింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ “త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు చేసిన పోరాట‌మే ఈ సినిమా. `విన్న‌ర్` అనే టైటిల్ మా క‌థ‌కు యాప్ట్. టైటిల్ విన్న వారంద‌రూ పాజిటివ్‌గా ఉంద‌ని చెబుతున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌లే ` సితార సితార…` అంటూ సాగే పాట‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు విడుద‌ల చేశారు. ఎక్స్ ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. త‌మ‌న్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం“ అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ “బాల‌న్స్ సాంగ్‌ని ఈ నెల 12 నుంచి చిత్రీక‌రిస్తాం. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ జ‌రుగుతోంది. ఈ నెల 9న థియేట్రిక‌ల్ విడుద‌ల చేస్తాం. 19న ఆడియో ప్రీ రిలీజ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నాం. ప్ర‌స్తుతం మా సినిమాలోని ఒక్కో పాట‌ను ఒక్కో సినీ ప్ర‌ముఖుడితో విడుద‌ల చేయిస్తున్నాం. అందులో భాగంగానే ఇటీవ‌ల సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఓ పాట‌ను విడుద‌ల చేశారు. `సితార సితార..` అనే ఆ పాట‌కు ఎక్స్ ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌స్తోంది. మ‌రో ఐదుగురు సెల‌బ్రిటీలు మిగిలిన ఐదు పాట‌ల‌ను విడుద‌ల చేస్తారు. త‌మ‌న్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. మా ద‌ర్శ‌కుడు చాలా అద్భుతంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. సినిమా మీద చాలా కాన్ఫిడెన్ట్ గా ఉన్నాం. మ‌హా శివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని ఈ నెల 24న సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్ల‌లో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన ర‌చ‌న ఆక‌ట్టుకుంటుంది. వెలిగొండ శ్రీనివాస్ మంచి క‌థ‌నిచ్చారు“ అని తెలిపారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు ఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా.కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్‌పూడి, ఆర్ట్: ప్ర‌కాష్‌, ఫైట్స్: ర‌వివ‌ర్మ‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌, ర‌చ‌న‌: అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus