‘విన్నర్’ గా మెగాహీరో కాదు!

గత రెండు రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో ‘విన్నర్’ అనే టైటిల్ వినపడుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మెగాహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాకు ఈ టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ను నిర్మాత దిల్ రాజు వేరే సినిమాకి ఉపయోగించుకుంటున్నారని టాక్.
తమిళ్ స్టార్ విజయ్ నటిస్తోన్న ‘తేరి’ చిత్రాన్ని దిల్ రాజు తెలుగులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ‘విన్నర్’ అనే టైటిల్ ను దిల్ రాజు రిజిస్టర్ చేయించారు. ఈ విషయాన్ని త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. ఇక గోపి చంద్ మలినేని మరో టైటిల్ కోసం వెతుక్కోవాలసిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus