మన ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో పరిస్థితులు కాస్త క్లిష్టంగా మారాయి….అందులోనూ….సినిమా పరిశ్రమ పరంగా చూసుకుంటే అవి ఇంకా ఎక్కువయ్యాయి అనే చెప్పాలి…విషయం ఏమిటంటే…సినిమా వాళ్ళ కష్టాలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…అయితే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు ఎక్కడ ఏం జరిగినా అది సినిమా పరిశ్రమపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది…తాజాగా ప్రధాని తీసుకున్న నిర్ణయంతో సినిమాహాళ్లకు వెళ్లాల్సిన ప్రజలు బ్యాంక్స్ కు, ఏటీయం లకు వెళుతున్నారు…ఇప్పటికీ కొన్ని సినిమాలు షూటింగ్ ఆపేసి కూర్చున్నాయి…ఇక అవన్నీ పక్కన పెడితే…సినిమాలు పూర్తి అయ్యీ విడుదలకు సిద్దం అయిన సినిమా సంగతి అయితే సరే సరి….ఈమధ్యనే విడుదలయిన అక్కినేని చైతు….’సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమా కలెక్షన్స్ లేక బయ్యర్స్ కు తీవ్ర నష్టాన్నే మిగిల్చింది….దానికి కారణం సైతం ఈ మనీ రద్దు అంశం కావడం విశేషం.
ఇదిలా ఉంటే మరో ఆరు సినిమాలు విడుదలకు రెడీ అయ్యీ…చెయ్యాలా వద్దా… అన్న ఆలోచనతో సందిగ్ధంలో ఉన్నాయి…అందులో….అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ సినిమా గత వారం…12నే విడుదల కావాల్సింది. అయితే ఈ హాటాత్ పరీణాంతో ఆగిపోయారు నిర్మాతలు….. ఇక పరిస్థితి చక్కబడేవరకు, ఆగుదామని అల్లరి నరేష్, అతని టీమ్ భావిస్తున్నట్టు సామాచారం. ఆ సినిమానె కాకుండా….విజయ్ ఆంథోనీ ‘భేతాళుడు’, సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, విశాల్-తమన్నా ‘ఒక్కడొచ్చాడు’, మోహన్‌లాల్ ‘మన్యంపులి’ సైతం డైలమాలో పడ్డాయి…ఇక మన రామ్‌చరణ్ ‘ధృవ’ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయాల్సి ఉంది. అయితే పరిస్తితుల ఆధారంగా విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చూద్దాం మరి ఈ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో….
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.