వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సమంత, చైతూ మూవీ!

పెళ్లి అయిన తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు వ్యక్తిగత జీవితానికి కంటే.. వృత్తికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. సినిమానే ఫస్ట్.. తర్వాతే ఏదైనా అనే రీతిలో ఉన్నారు. తాజాగా ఇద్దరికీ కొంచెం గ్యాప్ రావడంతో విదేశాల్లో విహారానికి వెళ్లారు. యు టర్న్, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలు రెండు విజయం సాధించడంతో ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూవీ షూటింగ్ మొదలయిపోయింది. పెళ్ళికి ముందు సమంత, చైతూ మూడు సినిమాల్లో నటించారు. పెళ్లి అయిన తర్వాత ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో  కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆమూవీని  షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి మజిలీ అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారు. హీరో, హీరోయిన్ ఇండియాకి రావడానికి కొన్ని రోజులు పట్టే ఆస్కారం ఉంది కనుక .. వారి లేని సన్నివేశాలను ముందుగానే కంప్లీట్ చేస్తున్నారు. వారు వచ్చిన వెంటనే షూటింగ్ లో జాయిన్ అవుతారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్థలు వచ్చాయని కథాంశంతో  రూపొందుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus