బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో క్లూ ఇచ్చిన రాజమౌళి!

దేశం మొత్తం ఒక సినిమా కోసం, ఒక ట్రైలర్ కోసం ఇంతలా ఎదురు చూడడం ఇదే తొలిసారి. రెండు నిముషాల ఇరవై సెకన్ల వీడియో.. 96 ఫ్రేమ్స్, ఇదివరకు చూడని అద్భుత దృశ్యాలు, రక్తాన్ని ఉరకలెత్తించే నేపథ్య సంగీతం, అంతా కలిపితే ఒకే ఒక్కడి విజన్. వేలమంది శ్రమ.

సినీ జనాలు ఈ ట్రైలర్ కోసం ఇంతలా ఎదురు చూడడం వెనుక కారణం ఒక్కటే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?. ఈ ప్రశ్నకు రాజమౌళి ట్రైలర్ లో ఏమైనా క్లూస్ ఇచ్చాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇండైరెక్ట్ గా చాలా క్లూస్ ఇచ్చాడు. ఇది నిజమో, కాదో తెలీదుకాని, ఒకసారి ట్రైలర్ లో ఉన్న 96 షాట్స్ ని బేస్ చేసుకుని మనం ఒకటి ఫిక్స్ అయి ఉందాం, మన గెస్ కరెక్ట్ అవకపోయినా కనీసం మ్యాచ్ అయినా అవుతుందో చూద్దాం.

ఫ్రేమ్ 1 మహిష్మతి రాజ్యంలో యుద్ధం జరుగుతుందని టాప్ యాంగిల్ లో మంటలు చెల రేగుతున్న దృశ్యాన్ని చూపించారు. బాహుబలి మొదటి పార్ట్ లో సకేతుడు మాహిష్మతి రాజ్యం సీక్రెట్ మొత్తం పక్షి నోటిలో పెట్టి పంపిస్తాడు. అది శత్రువులకు అంది, వారు రాజ్యం పై దండ ఎత్తి వచ్చారని స్పష్టం అవుతోంది.

డైలాగ్ లో మర్మం రాజమాత శివగామి ఒకే ఒక డైలాగ్ తో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చిన్న క్లూ ఇచ్చింది. అదే అంతర్యుద్ధం. అంటే కోట బయట కాకుండా కోట లోపలే శత్రువులు ఉన్నారన్నమాట. సో ఇటు వైపు వీళ్ల లోనే ఉండి ఎవరో మాహిష్మతి సైన్యాన్ని దెబ్బతీస్తున్నారు. వీళ్ళని నడిపిస్తున్నదెవరు?. Who is that black sheep???

ఆ మోసగాడు ఎవరో కాదు భల్లాల దేవుడే. శత్రువుల తో చేయి కలిపి మాహిష్మతి రాజ్యాన్ని దెబ్బతీస్తూ అంతర్యుద్ధం జరగటానికి కారణం అయ్యాడు. ఇప్పుడు రాజ్య ప్రజల ప్రాణాలు కాపాడాలంటే తనకి బాహుబలి ప్రాణాలు కావాలి అని అడుగుతాడు అన్నమాట. అప్పుడు శివగామి ఫీలింగ్ ని, ఈ ఫ్రేమ్ లో చూడవచ్చు

ట్రైలర్ లో ప్రభాస్ డైలాగ్ గమనిస్తే.. “అమరేంద్ర బాహుబలి అను నేను .. అశేషమైన మహిష్మతి రాజ్య ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి సాక్షిగా ప్రాణం చేస్తున్నాను” అని అంటాడు. ఈ మాట ప్రకారం ప్రజల ప్రాణాల కోసం బాహుబలిని చంపమని శివగామి కట్టప్పకు ఆజ్ఞ వేస్తుంది. అప్పుడు కట్టప్ప రియాక్షన్ ఈ షాట్ లో చూడవచ్చు.

ఎవరు ఎవరి కాళ్లను పట్టుకున్నారు
బాహుబలిని చంపేయమని కట్టప్పకి ఆర్డర్ ఇచ్చిన తరువాత సీన్ ఇది. రాజమాతగా, తన నిస్సహాయ స్థితిలో ఉండి తాను తీసుకున్న నిర్ణయానికి క్షమాపణగా దేవా సేన కాళ్ళు పట్టుకోవటం. కన్నీరు తెప్పించే సన్నివేశం ఇది. శివగామి దేవసేన కాళ్లు పట్టుకోవటమా.. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ ఫోటోలలోని బంగారు గాజులను చూడండి. మ్యాచ్ అవుతుంది.

ఈ చెయ్యి ఎవరిది ?
రక్తంతో తడిసిన రాజా కిరీటం ఫై ప్రతిజ్ఞ చేస్తున్న చెయ్యి ఎవరిదో తెలుసా ? దేవసేన ది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది వంద శాతం కరక్ట్.

అసలైన సీన్ ఇదే !
కట్టప్ప అలా పొడిచెయ్యగానే ఇలా సీక్వెన్స్ అయి పోతే అది రాజమౌళి సినిమా ఎందుకు అవుతుంది? ఇక్కడ పొడవటం, చనిపోవటం మాత్రమే కాదు తర్వాత వీరిద్దరి మధ్య పెద్ద ఎమోషనల్ సీన్ ఉంది. ఈ ఫ్రేమ్ చూడండి.
ట్రైలర్ లోని బెస్ట్ ఫ్రేమ్ ఇదే. చనిపోయే చివరి క్షణంలో కూడా రాజ ఠీవితో బాహుబలి కూర్చున్నాడు. వెన్నుపోటు పొడవటం బాహుబలి కలలో కూడా లేదు. ఆ క్షణంలో తాను చనిపోయి, మహిస్మతి రాజ్య ప్రజలను కాపాడాలి. అందుకే తన ప్రాణాలను పూర్తిగా తీసేయమని రాజుగా కట్టప్పకి బాహుబలి ఆజ్ఞాపిస్తున్నాడు. అదే ఈ ఫ్రేమ్.

బాహుబలిని పొడిచిన ప్రదేశానికి భల్లాలదేవ వస్తాడు. కొన ఊపిరితో ఉన్న బాహుబలిని భల్లాలదేవ పొడిచి పొడిచి చంపుతాడు. అందుకే బాహుబలి 1 లో దేవసేనతో “కసితీరా నా చేతులతో మళ్ళీ చంపాలి” అని డైలాగ్ చెబుతాడు. అంటే బాహుబలి ప్రాణాలు తీసింది భల్లాల దేవుడే.

పని పూర్తి అయింది..
శివగామి చెప్పిన పనిని పూర్తిచేసి బహుబలిని చంపిన కత్తితో రాజమందిరంలోకి కట్టప్ప వస్తున్న ఫ్రేమ్ ఇది.

కోట ముందు బాధతో చూస్తున్న వీళ్ల ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే కోటపై నుండి శివగామి బాహుబలి ఇక లేడని అనౌన్స్ చేసిందన్న మాట. ప్రజల కళ్ళలో ఆ బాధకి కారణం అదే అని తెలుస్తోంది.

అక్కడ బాహుబలి చనిపోయిన సమయంలోనే ఇక్కడ దేవసేన శివుడి(మహేంద్ర బాహుబలి)కి జన్మనిస్తుంది.

దేవసేనకి పుట్టిన బాబుకి మహేంద్ర బాహుబలి అని పేరు పెట్టి ప్రజలకు చూపిస్తున్న క్షణం ఇది.

ఆ తర్వాత భల్లాల దేవుడు మాట మీద నిలబడలేదు. దేవసేనకి పుట్టిన బిడ్డను కూడా చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ విషయం తెలిసి శివగామి బాబుని తీసుకొని అక్కడ నుంచి పారిపోతుంది. రహస్య మార్గం ద్వారా కొండ కిందికి వచ్చి, వాగుని దాటుతూ ప్రాణాలు విడుస్తుంది. ఇక ఇక్కడ నుంచి ఏమి జరిగిందో మీకు తెలిసిందే.

మా అంచనా ఎలా ఉందో.. మీ అభిప్రాయాల ద్వారా తెలియ జేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus