జీఎస్టీ నచ్చిందంటూ మహిళలు మెసేజ్ లు చేస్తున్నారు : వర్మ

అనేక వివాదాలకు తెరలేపిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ)’ షార్ట్ ఫిల్మ్ నిన్న రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. పోర్న్ స్టార్ మియా మాల్కావోతో రూపొందించిన రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని చూసేందుకు అత్యధిక మంది ఆసక్తి చూపించారు. ఇతర షార్ట్ ఫిలిం కి విభిన్నంగా 150 రూపాయలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ వెనుకడుగు వేయలేదు. ఎక్కువమంది ఈ షార్ట్ ఫిలిం కోసం సెర్చ్ చేయడంతో ఒక దశలో ఆ సైట్ పడిపోయింది. తరవాత ఆ సైట్ ని పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చారు. ఈ రెస్పాన్స్ కి వర్మ ఆనందంగా ఉన్నారు. ఈ షార్ట్ ఫిలిం ని మగవారు మాత్రమే కాకుండా మహిళలు కూడా చూసారని వర్మ వెల్లడించారు. ఈ చిత్రం చూసిన తర్వాత వారు తనకి మెసేజ్ లు పంపించారని తెలిపారు. ఆ మెసేజ్ లను

ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “సినిమాలో ప్రతి సన్నివేశం నాకు వణుకు తెప్పించింది. అది బూతు సినిమా కాదు.. ఫిలాసఫీ కూడా కాదు. మహిళ శరీరాన్ని, శృంగారాన్ని పవిత్రమైన పద్ధతిలో ఆరాధించడం. ఈ సినిమాను ప్రతి మహిళ శిరోధార్యంగా భావించాలి” అని ఓ మహిళ మెసేజ్ చేసిందని వర్మ పేర్కొన్నారు. ఇంకో మహిళ చేసిన మెసేజ్‌ను కూడా వెల్లడించారు. “ఓ అమ్మాయిగా సమాజ విధానాల అణచివేతకు నేను గురయ్యాను. కానీ జీఎస్టీ చూసిన తర్వాత దేవుడు నన్ను మహిళగా పుట్టించినందుకు గర్వపడుతున్నాను. మహిళ శృంగార స్వేచ్ఛ గురించి చెప్పిన విధానం నాకు నచ్చింది. నా శృంగార హక్కుల గురించి మరోసారి ఆలోచించేలా చేసింది. వర్మకి, మియా మాల్కోవాకి ధన్యవాదాలు” అని ఆమె మెసేజ్‌లో ఉన్నట్లు వర్మ ట్వీట్ చేశారు. మొత్తానికి వివాదాలతో మొదలైన ఈ షార్ట్ ఫిల్మ్ విజయంతో దూసుకుపోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus