ప్రసన్న లేకపోతే త్రినాధరావు పరిస్థితి ఏమిటి ?
- December 21, 2019 / 03:40 PM ISTByFilmy Focus
ఒక బాపు-రమణ, ఒక శంకర్-సుజాత, ఒక విజయభాస్కర్-త్రివిక్రమ్.. ఇలా దర్శకరచయితల జాబితాలో స్థానం సంపాదించుకున్న యువ దర్శకరచయిత ద్వయం త్రినాధరావు నక్కిన-బెజవాడ ప్రసన్న. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రాలు “సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే” సూపర్ హిట్ అయ్యాయి. త్వరలోనే త్రినాధరావు విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు కానీ కుదరడం లేదు.

అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకరచయితల ద్వయం నడుమ చీలికలు వచ్చాయని తెలుస్తోంది.
రైటర్ బెజవాడ ప్రసన్న త్వరలోనే దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ప్రసన్న డైరెక్టర్ గా సినిమా మొదలవ్వబోతుంది. మరి ప్రసన్న వేరు కుంపటి పెట్టాక నక్కిన త్రినాధరావు పరిస్తితి ఏమిటి అనేది తెలుసుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది.
రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!












