Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’.. కోట్లు రాబడుతోంది!

  • February 8, 2023 / 12:13 PM IST

నటుడు సుహాస్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ‘మజిలీ’, ‘డియర్ కామ్రేడ్’ ఇలా కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ లో కనిపించారు. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ తరువాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశారు. ఎలాంటి సినిమా చేసినా.. అందులో తన రోల్ కి ప్రాముఖ్యత ఉండేలా చూసుకుంటారు. అడివి శేష్ నటించిన ‘హిట్ 2’ సినిమాలో సుహాస్ పెర్ఫార్మన్స్ అందరికీ షాకిచ్చింది.

నెగెటివ్ రోల్ లో అదరగొట్టేశారు. హీరోగా కాకుండా.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది సుహాస్ కోరిక. ఆ ప్రకారమే.. తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఇతడు నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. షణ్ముఖ ప్రశాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఛాయ్ బిస్కెట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఏదీ లేదు. కానీ ప్రమోషన్స్ బాగా చేశారు.

దీంతో రిలీజ్ కు ముందు మంచి బజ్ వచ్చింది. ముందురోజే ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ఇలాంటి సినిమాకి ప్రీమియర్ షోలు పడడం.. అవి హౌస్ ఫుల్ అవ్వడమంటే విశేషమనే చెప్పాలి. సినిమా టాక్ బాగుండడంతో.. జనాలు ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాతో పాటు విడుదలైన సినిమాలు తేలిపోవడం కూడా ‘రైటర్ పద్మభూషణ్’కి కలిసొచ్చింది. ప్రోమోలు ఇంటరెస్టింగ్ గా కట్ చేయడంతో థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడైపోయాయి.

ఈ సినిమాకి పబ్లిసిటీతో కలిపి మొత్తం రూ.4 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఆ మొత్తం ఓటీటీ డీల్ తోనే వచ్చేసింది. ఇప్పుడు థియేటర్ల మీద వస్తున్నదంతా.. లాభాలే. దీంతో పాటు శాటిలైట్, ఇతర హక్కులు కూడా ఉంటాయి. ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమా రూ.10 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఇక లాంగ్ రన్ లో నిర్మాతలకు భారీ లాభాలు రావడం ఖాయం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus