మూడు సినిమాలతోనే కోట్లకి పడగెలెత్తిన ప్రసన్నకుమార్

అబ్బ సొత్తు కాదురా టాలెంటు అంటుంటారు మన సినిమా ఇండస్ట్రీలో.. అలాగే సక్సెస్ అనేది కూడా ఎప్పుడు ఎవరి దగ్గరా ఉండదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే తరహాలో.. సక్సెస్ లో ఉన్నప్పుడే ఫుల్ లెంగ్త్ రెమ్యూనరేషన్ అండుకోవాలనుకొంటున్నారు ప్రెజంట్ జనరేషన్ హీరోహీరోయిన్లు మరియు దర్శకులు. ఇందుకు రచయితలు మినహాయింపేమీ కాదు. వారు కూడా ఈమధ్యకాలంలో దర్శకులతో సమానమైన రెమ్యూనరేషన్ తీసుకొంటున్నారు. ముఖ్యంగా.. “నేను లోకల్, సినిమా చూపిస్త మావ” లాంటి సినిమాల సక్సెస్ లలో దర్శకుడితో సమానమైన పాత్ర పోషించిన ప్రసన్న కుమార్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ రైటర్ అయిపోయాడు. దాంతో మనోడి రెమ్యూనరేషన్ కూడా ఆకాశాన్నంటుతోంది.

నిన్నమొన్నటివరకు డైరెక్టర్ ప్యాకేజ్ ను షేర్ చేసుకొన్న ప్రసన్న కుమార్.. ఇప్పుడు సపరేట్ గా ప్యాకేజ్ తీసుకొంటున్నాడట. ప్రస్తుతం నాగశౌర్య సినిమాతోపాటు.. తదుపరి వెంకటేష్ సినిమాకి కూడా రైటర్ గా వర్క్ చేస్తున్న ప్రసన్న కుమార్.. సినిమాకి కోటి రూపాయల చొప్పున తీసుకొంటున్నాడట. అప్పట్లో త్రివిక్రమ్ మరియు కోనా వెంకట్ ల తర్వాత ఆ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకొంటున్న ఏకైక రచయితగా ప్రసన్నకుమార్ చరిత్ర సృష్టిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus