Moon Banerjee: గోపీచంద్ ‘యజ్ఞం’ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

‘తొలివలపు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్.. ఆ సినిమా నిరాశపరచడంతో ఆఫర్లు లేక విలన్ గా ‘జయం’ ‘నిజం’ ‘వర్షం’ వంటి సినిమాల్లో నటించాడు. 2004 లో ‘యజ్ఞం’ సినిమాతో అతను మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ వల్ల గోపీచంద్ హీరోగా నిలబడ్డాడు. కానీ ఆ సినిమా హీరోయిన్ కి మాత్రం ఈ సినిమా కలిసి రాలేదు.

‘యజ్ఞం’ లో శైలమ్మ అలియాస్ శైలు పాత్రలో మున్ మున్ బెనర్జీ అలియాస్ సమీరా బెనర్జీ. ఈ సినిమాలో నటిగానే కాకుండా గ్లామర్ తో కూడా అలరించింది. కానీ ఎందుకో ఈ సినిమా తర్వాత ఆమెకి ఆఫర్లు రాలేదు. బాలీవుడ్లో బుల్లితెర పై పలు షోలు చేసినా అవి కూడా కలిసి రాలేదు. దీంతో త్వరగానే ఫేడౌట్ అయిపోయింది. ఆ తర్వాత నిర్మాత నీరజ్ శర్మను ఈమె ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకి ఓ బాబు ఉన్నాడు.

ఈమెని జనాలు మర్చిపోయి 20 ఏళ్ళు కావస్తోంది. అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో సందడి చేయడంతో.. మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈమె లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజన్లు వెంటనే ఈమెను గుర్తుపట్టలేకపోతున్నారు. అంతలా ఈమె లుక్ మారిపోయింది అని చెప్పొచ్చు. అయితే ఇంకొంతమంది మాత్రం త్వరగా రీ ఎంట్రీ ఇవ్వమంటూ కామెంట్లు పెడుతున్నారు.ఆమె (Moon Banerjee) లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus