వామ్మో.. కన్నడ హీరోకి కూడా ఈ రేంజ్ పారితోషికమా?

నిజానికి కన్నడ సినిమాలను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే చాలా వరకూ వాళ్ళు చేసేవి రీమేక్ సినిమాలే కాబట్టి. అందులోనూ వాళ్ళు రీమేక్ రైట్స్ కొనుగోలు చేసుకోకుండానే డైరెక్ట్ గా రీమేక్ చేసేసుకోవచ్చు అని చాలా మంది అంటుంటారు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. కన్నడ సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఏర్పడేలా చేసిన చిత్రం ‘కె.జి.ఎఫ్ చాప్టర్’. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ‘బాహుబలి'(సిరీస్) తరువాత పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.

‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ ఫుల్ రన్లో 250 కోట్ల పైగా వసూళ్లను నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ చిత్రం సీక్వెల్ అయిన ‘కె.జి.ఎఫ్2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏకంగా ఈ చిత్రానికి 270 పైగా బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయనేది ట్రేడ్ పండితుల అంచనా. ఇక ‘కె.జి.ఎఫ్’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యశ్ ఈ చిత్రం కోసం ఎంత పారితోషికం తీసుకున్నాడు అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అందుతోన్న సమాచారం ప్రకారం..

‘కె.జి.ఎఫ్2’ కోసం హీరో యశ్ 30కోట్ల వరకూ తీసుకున్నాడని తెలుస్తుంది. ఓ కన్నడ హీరో ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం అంటే మాటలు కాదు. అంతేకాదు ‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి వచ్చే లాభాల్లో కూడా యశ్ కు వాటా ఉంటుందట. ఇప్పుడు యశ్ కూడా పాన్ ఇండియన్ స్టార్ కాబట్టి.. అతని తరువాత సినిమాలు కూడా అదే స్థాయిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus