Yatra2 Twitter Review: ‘యాత్ర 2 ‘ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • February 8, 2024 / 09:11 AM IST

దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర అంశాన్ని తీసుకుని ‘యాత్ర’ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. 2019 ఫిబ్రవరి 8 న అంటే సరిగ్గా 5 ఏళ్ళ క్రితం ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఏపీ ఎన్నికల బరిలో ఉన్న వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ అందించింది అని చెప్పాలి. 5 ఏళ్ళ తర్వాత సరిగ్గా అదే రోజు అంటే 2024 ఫిబ్రవరి 8 న ‘యాత్ర’ కి సీక్వెల్‌గా రూపొందిన ‘యాత్ర 2’ ని విడుదల చేయబోతున్నాడు దర్శకుడు మహి వి రాఘవ్.

ఈసారి కూడా వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ అందిస్తుంది అని వైసీపీ నేతలు, అభిమానులు భావిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి మంచి హై ఇచ్చిందట. సెకండ్ హాఫ్ కొంత బోరింగ్ కొట్టించింది అని అంటున్నారు. ‘యాత్ర’ సినిమా లైన్ ప్రకారం.. 2009 కి ముందు కాంగ్రెస్ పార్టీ హవా తక్కువగా ఉంది. ఆ టైంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పై ఉన్న సింపతీ యాంగిల్ ను ఆ టైంలో బాగా హైలెట్ చేయడం జరిగింది.

అయితే ‘యాత్ర 2 ‘ లో దర్శకుడు తన అభినయాన్ని కొంచెం ఎక్కువగా చాటుకునే ప్రయత్నం చేసాడని, అది జనాలకి భజనగా అనిపించొచ్చు అని అంటున్నారు. మొత్తంగా ‘యాత్ర’ అంత కాకపోయినా.. యావరేజ్ గా అనిపిస్తుంది అని చెబుతున్నారు.

av

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus